Monday, January 20, 2025

అమెరికాలోని 25 నగరాల్లో ఘనంగా దశాబ్ది వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ధి వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. బిఆర్‌ఎస్ యూఎస్‌ఏ ఆధ్వర్యంలో అమెరికా వ్యాప్తంగా 25 నగరాల్లో ఈ వేడుకలను నిర్వహించి తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు అమెరికా వ్యాప్తంగా బిఆర్‌ఎస్ యూఎస్‌ఏ అడ్వైయిజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ నాయకత్వంలో రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర రావు, బియ్యాల జనార్దన్ రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతాం: మహేశ్ బిగాల
ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ అమెరికా వ్యాప్తంగా రాష్ట్రావతరణ వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. కొలంబస్‌లో నిర్వహించిన ఉత్సవాల్లో కెసిఆర్ బాల్యమిత్రుడు ఉమారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమారెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ఒక పోరాట యోధుడని, బాల్యం నుంచి పట్టుదల ఎక్కువన్నారు. సంకల్పం దార్శనికత, దక్షతకు మారు పేరు కెసిఆర్ అని ఆయన అన్నారు. చిన్ననాటి తీపి గుర్తులు నెమరువేసుకుంటూ కెసిఆర్ వ్యూహారచన, రాజకీయ చాతుర్యాన్ని ఆయన కొనియాడారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆరంభించిన పనిలో విజయం సాధించే వరకు వదిలే వారు కాదని ఆయన ప్రశంసించారు.

కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి: తన్నీరు మహేశ్
ఈ సందర్భంగా తన్నీరు మహేష్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన అనతి కాలంలోనే కెసిఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు పెట్టించారన్నారు. ప్రగతి, విద్య, వైద్యం ఆరోగ్యం, సంక్షేమం, విద్యుత్, వ్యవసాయం, సాగు నీరు, త్రాగునీరు ఏ రంగమైనా కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. అమెరికా వ్యాప్తంగా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వేణు పామేర, నరసింహ నాగులవంచ, డేవిడ్ విక్రమ్, సాజిత్ దేశినేనిలు పాల్గొన్నారు.

ఈ వేడుకలు నిర్వహించడం గర్వకారణం: ఎమ్మెల్సీ సురభి
బే ఏరియాలో జరిగిన దశాబ్ధి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలోనే కాదు అమెరికా అంతటా ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. నేడు దశాబ్ధి ఉత్సవాలు చేసుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో పూర్ణ బైరి, నవీన్ జలగంలు పాల్గొన్నారు. డ్యాలస్, టెక్‌సాస్‌లో శ్రీనివాస్ సురభి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో మూడు వందలకు పైగా ఎన్నారైలు పాల్గొన్నారు. దేవేందర్ చిక్కాల, మనోజ్ ఇనగంటి, గిరిధర్ వీరమనేని, శ్రీకాంత్ పీచర, కిరణ్ మిర్యాల, కేశవ్ రావు, శశి దొంతినేని తదితరులు పాల్గొన్నారు.

లాస్ ఏంజెల్స్ కాలిఫోర్నియాలో….
లాస్ ఏంజెల్స్ కాలిఫోర్నియా నగరంలో హరిందర్ తాళ్లపల్లి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. అనిల్ ఎర్రబెల్లి, నవనీత్ వోణి, వలబోజు చంద్ర, సంతోష్ గాంతారం, ప్రవీణ్ యరమడలు పాల్గొన్నారు. మహేష్ పొగాకు ఆధ్వర్యంలో న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్ డిగ్ట్రూట్ – కంటెస్టెంట్ మోరిస్ కౌంటీ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రవి ధన్నపునేని, భగవాన్ పింగిళి, శ్రీనివాస్ జక్కిరెడ్డి, వెంకట్ తమాలిలు పాల్గొన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసిలో అనిల్ కేశినేని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కమల్ వాల, వెంకట్ తాండ్ర, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. అనిల్ ధన్నపునేని ఆధ్వర్యంలో డెట్రాయిట్లో జరిగిన ఉత్సవాల్లో వెంకట్ మంతెన, సునీల్ మర్రి, కాశి కోట, శ్రీధర్ తిప్పి, సంతోష్, అశోక్ పాల్గొన్నారు. బిందు రెడ్డి ఆధ్వర్యంలో కాన్సాస్లో జరిగిన ఉత్సవాల్లో రాజ్ చీదేళ్ల, వెన్నల, భారతి రెడ్డిలు, మహిపాల్ రెడ్డి వంచ ఆధ్వర్యంలో చికాగోలో నిర్వహించిన ఉత్సవాల్లో వెంకటేష్ రావు తుడి, శ్రీనివాస్ కాసుల, సాత్విక్ రెడ్డి మేకల, పూర్ణచందర్ అల్లంనేని, శాక్రమెంటోలో సతీష్ పసుపులేటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో శిరీష పులిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News