Wednesday, January 22, 2025

ఆస్ట్రేలియాలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలను మెల్‌బోర్న్‌లో యూత్ వింగ్ కన్వీనర్ వినయ్ గౌడ్, ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బిఆర్‌ఎస్ సభ్యులందరూ కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. పదేళ్లలో కెసిఆర్ చేసిన పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్లకార్డులతో ప్రదర్శించారు. ఈ సందర్భంగా కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ పిలుపుమేరకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్బెర్ర, అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, బల్లారాట్, పెర్త్, గోల్ కోస్ట్, హోబర్ట్, డార్విన్ నగరాల్లో పది రోజులు ఈ సంబురాలను జరుపుకుంటామని ఆయన తెలిపారు.

తెలంగాణ కీర్తిని, కెసిఆర్ రాష్ట్రంలో చేస్తున్న సర్వతముఖాభివృద్ధి గురించి, దేశంలో తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్న తీరును ఎన్‌ఆర్‌ఐలకు తెలియజేసేలా ఈ వేడుకలు జరుపుకుంటామని నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకల్లో సాయిరాం ఉప్పు, విశ్వామిత్ర, సనిల్, సతీష్, ప్రవీణ్, అమిత్ , సురేష్, వినోద్, చైతన్య, సూర్య రావు, విక్రమ్ కందుల, సంజీవ్ రెడ్డి, శన్ముఖ్, వేణు నాన్న, సాయి గుప్తా, రాకేష్, అరుణ్, నరేందర్, హరిపల్ల, విజయ్, డా.అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News