రాష్ట్ర పోలీసు గృహనిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్
హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు తెలంగాణ ఘనకీర్తిని దశదిశలా చాటి చెప్పే స్థాయిలో జరిగాయని రాష్ట్ర పోలీసు గృహనిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ 60 ఏళ్ల పోరాట చరిత్ర అని, సిఎం కెసిఆర్ సారథ్యంలో పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్నీ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుని పులకించిపోయారని ఆయన పేర్కొన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రం భారత వినీలాకాశంలో వెలుగులు విరజిమ్ముతున్న ధృవతారగా నిలిపిన కెసిఆర్ పాలకుడే కాదు సేవకుడినని నిరూపించారని ఆయన పేర్కొన్నారు. ప్రతి తెలంగాణ పౌరుడి ఛాతీ ఉప్పొంగేలా ఖ్యాతి పొందే స్థాయికి తెలంగాణను తీసుకువచ్చిన దార్శనికుడు కెసిఆర్ అని దామోదర్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా నాడు, నేడు పరిస్థితులను ఒకసారి బేరీజు వేసుకొని చూస్తే, బిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన ఆశ్చర్యకరమైన విజయాలు ఎన్నోమన కళ్ల ముందు కదలాడాయన్నారు.