Saturday, April 5, 2025

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పండగలా జరగాలి

- Advertisement -
- Advertisement -
  • సత్తుపల్లి నియోజకవర్గ అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సండ్ర సమీక్ష

సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సత్తుపల్లి ఎంఎల్‌ఎ సండ్ర వెంకట వీరయ్య నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో సత్తుపల్లిలో లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా, పండగ వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు.

పదేళ్ల కాలంలో రాష్ట్రంలో, ఆయా గ్రామాలలో సంధించిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉత్సవాలను నిర్వహించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఐదు మండల శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News