Thursday, December 19, 2024

‘దోస్త్’ ప్రకటన విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’(డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్) ప్రకటన విడుదల చేశారు. దీనిని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. మూడు విడుతల్లో జరిగే ప్రవేశాలకు మే 6(సోమవారం) నుంచి దరఖాస్తు చేసుకోవాలి. వేయికి పైగా డిగ్రీ కళాశాలల్లో ఈసారి 4లక్షల సీట్లు ఉన్నాయి.

తొలి దశ నమోదు మే నుంచి మే 25 వరకు ఉంటుంది. రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్లను మే 15 నుంచి మే 27 వరకు చేసుకోవాలి. జూన్ 3వ తేదీన తొలి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 4 నుంచి 10వ తేదీ లోపు స్వయంగా రిపోర్టు చేయాలి.

రెండో దశ నమోదు రూ. 400 ఫీజుతో జూన్ 4 నుంచి జూన్ 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్లు జూన్ 4 నుంచి జూన్ 14 వరకు చేసుకోవాలి. జూన్ 18న సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 19 నుంచి జూన్ 24 వరకు స్వయంగా రిపోర్టు చేయాలి.

మూడో దశ నమోదు రూ. 400 ఫీజుతో జూన్ 19 నుంచి జూన్ 25 వరకు చేసుకోవాలి. జూన్ 19 నుంచి జూన్ 25 వరకు వెబ్ ఆప్షన్ చేసుకోవాలి. జూన్ 29న సీట్ల కేటాయింపు ఉంటుంది.

జూలై 8 నుంచి  తరగతులు ఆరంభమవుతాయి. ఈ ఏడాది బికాం ఫైనాన్స్, బిఎస్సీ బయో మెడికల్ సైన్స్ అనే కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు గమనించగలరు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News