Saturday, November 9, 2024

తెలంగాణలో అభివృద్ధి బాగుంది: న్యూజిలాండ్ మంత్రులు

- Advertisement -
- Advertisement -

న్యూజిలాండ్ కేంద్రమంత్రులు, ఎంపిల ప్రశంస
న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దశాబ్ధి ఉత్సవాలు

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని న్యూజిలాండ్ కేంద్రమంత్రులు, ఎంపిలు ప్రశంసించారు. చాలా తక్కువ సమయంలో తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని వారు కితాబునిచ్చారు. న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ దేశానికి చెందిన కేంద్ర మంత్రులు మైఖేల్‌వుడ్, ప్రియాంకా రాధాకృష్ణన్, ఎంపిలు పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో భాగంగా ముందుగా అమరులకు నివాళులు అర్పించారు. ఈ ఉత్సవం న్యూజిలాండ్‌లోని మౌంట్ ఈడెన్ వార్ మెమోరియల్ హాల్ లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా న్యూజిలాండ్ కేంద్రమంత్రి మైఖేల్ వుడ్ తెలంగాణ ప్రజలకు అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు రెండు దశాబ్దాలుగా న్యూ జిలాండ్‌లో వివిధ రకాల సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న కళ్యాణ్ రావు కాసుగంటి కృషిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న తెలంగాణ ప్రముఖలకు ‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ ఇన్ న్యూజిలాండ్’ అవార్డులను బహుకరించారు.

తెలంగాణకు మంచి నాయకత్వ ప్రతిభ ఉంది: న్యూజిలాండ్ కేంద్రమంత్రి

న్యూజిలాండ్ కేంద్రమంత్రి ప్రియాంకా రాధాకృష్ణన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తాను సందర్శించానని చాలా తక్కువ సమయంలో ఆ రాష్ట్రం అభివృద్ధి సాధించిందని, మంచి నాయకత్వ ప్రతిభ తెలంగాణకు ఉందన్నారు. హోనోరారి కౌన్సిల్ శ్రీభవ్ థిల్లాన్ తన సందేశాన్ని వినిపించారు. ఎంపిలు కీరన్‌చౌర్, హెలెన్‌వైట్, కాన్వాల్జిత్ సింగ్ భక్షి, ప్రాదేశిక ఎన్నికల ఎంపి అభ్యర్థులు ఖరగ్‌సింగ్, శివకిలారి ఎన్.జెడ్‌ఐసిఏ అధ్యక్షుడు నరేన్ బాణా, ఇతర సంఘ నాయకులూ పలువురు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ యువత జానపద, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

న్యూజిలాండ్ తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు రామ్మోహన్ దంతాల, రాంరెడ్డి తాటిపత్రి, శ్రీనివాస్ పుదారి, లక్ష్మణ్ రెడ్డి కలకుంట్ల, శ్రీకాంత్ వేముల, అశుతోష్ రాజ్ గౌలికర్, స్వాతి సందీప్, సందీప్ ప్యారాకలు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీమతి ఐశ్వర్య కోకా కార్యక్రమ మాస్టర్ అఫ్ సెరిమోనిస్‌గా అందరిని ఆకట్టుకున్నారు. గిరిధర్ మోర్ల , మనోహర్ రావు, అశోక్ రావు, గౌతమ్ రెడ్డి, మురళి అన్ను, అర్చిత్ నడిపెల్లి తెలంగాణ దావత్‌లు, శ్వేతా కుందూ సభ్యులను అలోక్ కుందూ సాంకేతిక విభాగాలను పర్యవేక్షించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News