Sunday, April 20, 2025

అభివృద్ధికి అవరోధాలు

- Advertisement -
- Advertisement -

మూసీ ప్రక్షాళనకు అడ్డంపడుతున్న బిజెపి, బిఆర్‌ఎస్ ఢిల్లీ కాలుష్యం
నుంచి గుణపాఠం నేర్చుకోవాలి అభివృద్ధిలో ప్రపంచం నగరాలతోనే
తెలంగాణ పోటీ మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, రేడియల్ రోడ్లు రాష్ట్ర
పురోగతికి కీలకం అభివృద్ధికి అందరి సహకారం అవసరం జపాన్
తెలుగు సమాఖ్య కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధిలో ప్ర పంచంతోనే తెలంగాణ పోటీ అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉ న్న సిఎం రేవంత్ శనివారం జపాన్ తెలుగు స మాఖ్య ఏర్పాటు చేసిన ‘తెలుగు వెలుగు పం డుగ సంబరాలు’ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో తెలంగాణ అభివృ ద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో జపాన్‌లోని తెలుగు వారు కూడా భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో ప్రగతి సాధించామని రాష్ట్రం లో త్వరలోనే డ్రై పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నామని సిఎం రేవంత్ తెలిపారు.

తెలంగాణ అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.తెలంగాణలో పెట్టు బడులు, పరిశ్రమలు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని సిఎం అన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అ వసరం ఉందన్నారు. తెలంగాణ పోటీ అమరావతి, బెంగళూరు, ముంబయి, చెన్నైలతో కాదని, లండన్, టోక్యో వంటి అభివృద్ధి చెందిన నగరాలతోనేనని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరమని, ఎవరికి చేతనైనంత వారు చేయగలిగింది చేస్తే ప్రపంచంతోనే మనం పోటీ పడొచ్చని ఆయన పిలుపునిచ్చారు.

నీరు, మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక

టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నీరు, మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి నెలకొందని, కేవలం కాలుష్యంతో ఢిల్లీ స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళన చేయాలని తాను చెబుతున్నానని, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు కాబోతున్నాయన్నారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో మీకు తెలుసని మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News