Monday, December 23, 2024

ఐఎఎస్, ఐపిఎస్‌లు మనవారైతే రాష్ట్రానికి మంచి జరుగుతుంది: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిరుద్యోగ సమ్యలు పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.  ప్రజాభవన్‌లో రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన రాష్ట్ర అభ్యర్థులతో సిఎం ముఖాముఖి సమావేశమయ్యారు. సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి ద్వారా ఆర్థిక సాయం కోసం కొత్త పథకాన్ని ప్రభుత్వం తీసుకోచ్చిందన్నారు. ప్రభుత్వంపై అభ్యర్థులకు నమ్మకం కలగాలనే త్వరగా నోటిఫికేషన్లు ఇస్తున్నామని, ప్రణాళిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నామని, జూన్ 2న నోటిపికేషన్, డిసెంబర్ 9 లోపు ఉద్యోగాలిచ్చేలా జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామని రేవంత్ వివరించారు.

సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరపున సాయం చేస్తున్నామని, మెయిన్స్‌కు ఎంపికైనా అభ్యర్థులు కచ్చితంగా జాబ్ సాధించాలన్నారు. సివిల్స్ సాధించి మన రాష్ట్రానికే రావాలని, ఐఎఎస్, ఐపిఎస్‌లు మనవారైతే రాష్ట్రానికి మంచి జరుగుతుందని, పరీక్షలు మాటిమాటికి వాయిదా వేయడం మంచిది కాదని ఆయన సూచించారు. నిరుద్యోగుల బాధలు తమకు తెలుసునని, అభ్యర్థుల సమస్యలను అర్థం చేసుకొని గ్రూప్-2 పరీక్ష వాయిదా వేశామన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్‌లో తెలంగాణ నుంచి 41 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సిఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంఎల్‌ఎలు, సింగరేణి సిఎండి బలరామ్, తదితరలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News