Thursday, January 23, 2025

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి

- Advertisement -
- Advertisement -
  • మంత్రి చామకూర మల్లారెడ్డి

శామీర్‌పేట: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం శామీర్‌పేట మండల కేంద్రంలోని పెద్ద చెరువు దగ్గర ఊరురా చెరువుల పండుగ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్‌తో కలిసి చెరువుల పండుగ ఘన ంగా నిర్వహించారు.

పెద్ద చెరువులో (గంగమ్మ) ప్రత్యేక పూజలు నిర్వహించారు. కట్ట మైసమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెరువు కట్టపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిష్ స్టాల్స్‌లను జిల్లా కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సాగునీటి వనరుల చైర్మన్ ప్రకాష్, అదనపు జిల్లా కలెక్టర్లు నరసింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయ్, జడ్పిటిసి అనిత లాలయ్య, మత్స్యశాఖ జిల్లా అధికారులు, వివిధ గ్రా మాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News