Wednesday, January 22, 2025

తెలంగాణ అభివృద్ధే నా ధ్యాస.. శ్వాస

- Advertisement -
- Advertisement -

పేదరికం, నిరక్షరాస్యతలేని రాష్ట్రంగా చేయడమే నా కల

ఇతర రాష్ట్రాలు అసూయపడేలా అభివృద్ధి చేశా

తెలంగాణ అంటేనే నరేంద్ర మోడీకి చిన్నచూపు

గజ్వేల్‌లో ఆకాశాన్నంటే అభివృద్ధి చేస్తా ఒకే విడతలో దళితబంధు..రెండు ఐటి టవర్లు ఇస్తాం

12 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు

భూనిర్వాసితులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు

ప్రజల ఆశీర్వాదంతో అన్నీ సాధిస్తాం

ఎన్నికల ప్రచార సభలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/గజ్వేల్ జోన్/హన్మకొండ ప్రతినిధి : రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిపైనే తన ధ్యాసంతా ఉం టుందని, రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించడం తన కల అని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు అసూయ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోవాలన్న ప్రణాళికలు చేశామని, అందులో ఇప్పటికే అనేక విజయాలు సాధించామని అన్నారు. గజ్వేల్ ప్రజలు తనను ఈసారి ఎన్నికలలో ఆశీర్వదిస్తే అనేక విధాలుగా గజ్వేల్‌ను ఆకాశాన్ని అంటే అభివృద్ధికి తీ సుకెళ్తామని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. మంగళవా రం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో వేలాదిగా ప్రజలు తరలి వచ్చిన ఎన్నికల ప్రచార ముగింపు సభలో కెసిఆర్ మా ట్లాడుతూ ఒకనాడు ఎట్లున్న గజ్వేల్ ఇప్పుడెట్టయిందో ప్రజలకు కళ్లముందే కనిపిస్తున్నది కదా అని కెసిఆర్ అన్నారు.

దేశానికే ఒక రోల్‌మోడల్‌గా నిలిచిన తెలంగాణను తయారుచేసే క్రమంలో అనేక అభివృద్ది పను లు ఇప్పటికే సాధించామని, ఇంకా అనేక అభివృద్ది కా ర్యక్రమాలను చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసి న నిర్వాసితుల త్యాగాలను ఎప్పుడూ మరచిపోయేవి కావని, నిర్వాసితులకు సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకునేందకు తనవద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. ఈ ప్రాంతంలో కనీసం 12 కాలుష్య రహిత పరిశ్రమలు రాబోతున్నాయని వాటిలో నిర్వాసిత కుటుంబాలకు ఉపాధి ఉద్యోగ కల్పన చేస్తామని సిఎం హామీ ఇచ్చారు. రైతులను భాగస్వాములను చేసే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రానున్నాయని ఆయన అన్నారు. అంతే కాకుండా గజ్వేల్ ప్రాంతంలో రెండు ఐటి టవర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉందని, దీనికి తగిన స్థల సేకరణ చేయాల్సి ఉందన్నారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని అ న్నారు. గజ్వేల్ ప్రాంతంలో పరిశ్రమలతో పాటు విల్లాల నిర్మాణాలకు క్యూ కడతాయని అన్నారు. గజ్వేల్ ప్రజలకు మరో శుభవార్త ఏమంటే ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వంలో దళితబంధు పథకాన్ని ఒకే విడతలో దళితులందరికీ అమలు చేస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఫిబ్రవరి నాటికి తనకు 70 ఏండ్ల వయసు వస్తుందని, తన ఆశ, ధ్యాస అంతా తెలంగాణ అభివృద్ది మాత్రమేనని సిఎం కెసిఆర్ అన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కీర్తి తనను ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా చేసిందని, ఇది తనకు ఎంతో తృప్తిని ఇస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట, గజ్వేల్ గడ్డ తనకు బలాన్ని ఇచ్చిందని సిఎం కెసిఆర్ ఉద్యమ అనుభవాలన్ను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుట్రలు పన్ని ప్రాజెక్టులను కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూ లదోయాలని చూశారన్నారు. కానీ వారి ఆటలు సాగనివ్వలేదన్నారు. ప్రతిమండలానికి ఒక మార్కెట్ యార్డు, ఒకే చోట సమీకృత కార్యాలయాల భవన సముదాయాలు నిర్మించుకోవాలని అన్నారు.

ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన 50 టిఎంసిల సామర్థం కల మల్లన్నసాగర్ నిర్మించుకున్నామని, ఈ ప్రాంతంలో సుమారు 50 ఎకరాల అటవీ ప్రాంతం కూడా ఉందన్నారు. అహ్లాదకరమైన ఈ ప్రాంతం అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ది కానుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటికి పడ్డ కష్టాలు ఇప్పుడు తెలంగాణలో లేకుండాపోయింది. గోదావరి జలాలు వస్తున్న కారణంగా ఒకప్పుడు 30, 40 లక్షల టన్నులు పండిన పంటలు ఇప్పుడు 3 కోట్ల టన్నుల పంటలు పండుతున్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ ప్రాంతంలో వాణిజ్య పంటలను కూడా అభివృద్ది చేసి వాటిని ఇతర ప్రాంతాలకు మార్కెటింగ్‌కు రవాణా చేయటానికి వీలుగా గజ్వేల్‌కు రైలు సౌకర్యం కూడా వచ్చిందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ వాళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని, నెహ్రూ, ఇందిర కాలంలో మంచిపనులు చేస్తే ఇంత దరిద్రం ఎందుకు ఉండేదన్నారు. ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెట్టేవారు. మతకలహాలు, కాల్పులు, కర్ఫూల రా జ్యం తెస్తారని ఆయన అన్నారు. 3 గంటల కరెంటుచాలని రేవంత్ రెడ్డి, రైతు బందు వృథా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు అంటున్నారని ఇదెంతవరకు సరైందో, కాంగ్రెస్ పాలన వస్తే ఎట్లుంటదో ఇక ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. పేదరికం, నిరక్షరాస్యతలు లేని తెలంగాణ రాష్ట్రం చేయాలన్నది తన కల అం దుకోసమే తాను కృషిచేస్తానన్నారు. ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం రాగానే రైతుబందును రూ.16 వేలకు, ఆసరా పెన్షన్లను రూ.5 వేల వరకు పెంచుతామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. కేంద్రంలో ఉన్న బిజెపి సారథ్యంలోని మోడీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్దిపై చిన్నచూపుందని, అందుకే ఏ ఒక అభివృద్ది పథకాన్ని తెలంగాణకు ఇవ్వలేదని కెసిఆర్ ఆరోపించారు. కనీసం ఒక నవోదయ విద్యాలయం కానీ, మెడికల్ కాలేజీని కానీ మోడీ ప్ర భుత్వం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో వైద్య విద్య, గురుకుల విద్యను ఎంతో అభివృద్ది చేశామన్నారు. 1019 గురుకుల పాఠశాలలు, ఉన్నాయన్నారు.జిల్లాకో మెడికల్ కళాశాల, మహిళా గురుకుల కాలేజీని ఏర్పాటు చేసుకున్నామన్నారు. మరో 5,6 నెలల్లో రాష్ట్రంలో 4 మల్టిపుల్ ఆసుపత్రులు రాబోతున్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. భారీగా జనం హాజరైన ఎన్నికల ప్రచార సభ కు ఎంఎల్‌సి డా. యాదవరెడ్డి, ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఎఎంసి చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, డిసిపిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

వరంగల్ ఉద్యమాలకు నిలయం: కెసిఆర్
వరంగల్లు : తెలంగాణ మలిదశ ఉద్యమంలో వరంగల్ పాత్ర కీలకమని కెసిఆర్ అన్నారు. వరంగల్ కెఎంసిలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అధినేత కెసిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధన విషయంలో వరంగల్ ప్ర జల ముఖ్య భూమిక పోషించిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్ల కాలంగా దఫ దఫాలుగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రపంచంలో నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటున్నారు. ఆమె రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు కష్టాలే.. దోపిడి రాజ్యం ఎలిందన్నా రు. వరంగల్‌కు ఐటీ హబ్ వచ్చింది. అక్కడ యువతకు ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. ఆజాం జాహి మిల్లు ఆనవాలు లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్‌పార్టీదేనని, దానిస్థానంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని, దాంతో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. సభా ప్రాం గణం పక్కన 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నట్లు దీనిని వరంగల్ ప్రజల ఆరోగ్య భద్రత కోసమే అన్నారు. అభివృద్ధి అంటే వరంగల్ అని అన్నారు.

వరంగల్ పశ్చిమ అభ్యర్థి వినయ్ భాస్కర్ మీ బీసీ బిడ్డ, మీలో ఒక్కడు, నిత్యం ప్రజలతోనే ఉండే మనిషి, నరేందర్ ఒక లారీ డ్రైవర్ కొడుకు, సామాన్యుని కష్టాలు తెలిసిన అభ్యర్థులు వీరు. వీరిని గెలిపించి తీరాలని కెసిఆర్ ప్రజలను కోరారు. వినయ్ భాస్కర్ మాటల్లో వరంగల్ హైదరాబాద్‌తో పోటీ పడుతున్నట్లు చెప్పడం నిజంగా నాకు గర్వంగా ఉందన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండి వారికి అన్నింటిలో ఆసరగా ఉండే ఇద్దరినీ ప్రజలు గెలిపించాలన్నారు. వరంగల్ పశ్చిమ బీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థి వినయ్‌భాస్కర్, వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపనేని నరేందర్, సుందర్‌రాజ్, రవీందర్‌రావు, మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News