Friday, November 15, 2024

గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో అభివృద్ధి: గుత్తా

- Advertisement -
- Advertisement -

నల్గొండ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా సందర్భంగా వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారని,  గత ఎనిమిది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధించిందన్నారు.  దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అమరుల స్ఫూర్తితో యువత తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలను సాధించామని,  గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని గుత్తా తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, ఎస్పి రేమా రాజేశ్వరి,
మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్, మున్సిపల్ కమిషనర్ రమణ చారి, జడ్పి ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, కౌన్సిలర్లు, స్థానిక నేతలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News