హైదరాబాద్ : హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదంపై తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. యాదాద్రిలో చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. భోనగిరి రూరల్ పిఎస్ పరిధిలో ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయని ఆయన పేర్కొన్నారు. ఈ రైలునుంచి ప్రయాణికులు అందరినీ సురక్షితంగా బయటకు తీయగ లిగామని వివరించారు. వారిని బస్సులో ఎక్కించి తరలించామని పోలీసులు పేర్కొన్నారు.
అగ్నిమాపక శాఖ, రైల్వే శాఖ సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ఒక్క మరణం కూడా సంభవించలేదని వెల్లడించారు. ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్‌కు మొత్తం 18 బోగీలు ఉండగా, 11 బోగీలను ఇంజిన్ నుంచి వేరు చేశారని, వాటిని సేఫ్‌గా తీసుకెళ్లారని డిజిపి అంజనీ కుమార్ తెలిపారు. ఏడు బోగీల్లో మంటలు వ్యాపించాయని, అందులో మూడు బోగీల్లో ఇప్పటికే మంటలను పూర్తిగా