Monday, December 23, 2024

వొడితెల కుటుంబంలోనే తెలంగాణ డిఎన్‌ఏ

- Advertisement -
- Advertisement -

హుజురాబాద్ : వొడితెల కుటుంబంలోనే తెలంగాణ డిఎన్‌ఏ ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సైదాపూర్ క్రాస్ రోడ్డులో స్వర్గీయ మాజీ రాజ్యసభ సభ్యుడు సింగాపూర్ రాజేశ్వర్ రావు విగ్రహాన్ని మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపి కెప్టెన్ లక్ష్మికాంతారావు, ప్రభుత్వ విప్ కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు సతీష్ కుమార్, రసమయి బాలకిషన్ సోమవారం ఆవిష్కరించారు.

అనంతరం బిఆర్‌ఎస్ కార్యాలయంలో రాజేశ్వర్ రావు మనవడు బిఆర్‌ఎస్ యువ నాయకుడు ప్రణవ్ బాబు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా ఉన్న రాజేశ్వర్ రావు తెలంగాణ సాధన కోసం పరితపించి కేసిఆర్ వెన్నంటి ఉన్న మహానుభావుడని కొనియాడారు. తెలంగాణ ఆవశ్యకతపై ఆయన వ్రాసిన వ్యాసాలు ఎంతగానో ఆలోచింపజేశాయన్నారు.

గల్లీ నుండి ఢిల్లీస్థాయికి ఎదిగి తన ఊరు పేరునే ఇంటిపేరుగా మార్చుకుని సింగాపూర్ రాజేశ్వర్ రావు అనేక విద్యాసంస్థలు నెలకొల్పి వందలాది మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందించారని గుర్తు చేశారు. మైనార్టీలో ఉన్న స్వర్గీయ ప్రధాని పివి నర్సింహరావు ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో రాజేశ్వర్ రావు కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. పార్టీలకతీతంగా సహాయం చేసిన రాజేశ్వర్ రావును నక్సలైట్లు కూడా గౌరవించేవారని తెలిపారు.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాంటెక్ ఇంజనీరింగ్ కళాశాలలో తనకు ఉచితంగా సీట్ ఇచ్చిన మహానుభావుడని గురువు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపి కెప్టెన్ లక్ష్మికాంత రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ పివి వాణీదేవి, ఎమ్మెల్యేలు సతీష్ బాబు, రసమయి బాలకిషన్, జెన్‌కో సియండి ప్రభాకర్ రావు, జెడ్పి చైర్‌పర్సన్ కనుమల్ల విజయ్,

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణరావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, రాజేశ్వర్ రావు తనయులు శ్రీనివాస్ రావు, కిషన్ రావు, ఎంపిపి రాణి సురేందర్ రెడ్డి, జెడ్పిటిసి బక్కారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News