Tuesday, January 7, 2025

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఈసెట్ ఫలితాలను విడుదల అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఈ-సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సెట్‌లో 95.86% శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 23,330 మంది విద్యార్థులు ఈ సెట్ పరీక్ష రాయగా.. వారిలో 22,365 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌ https://ecet.tsche.ac.in/ ద్వారా రిజల్ట్స్ చూసుకోవచ్చని చెప్పారు. ఇక, జూన్ 2 నుంచి ఈ సెట్ అడ్మిషన్లు మొదలవుతాయని లింబాద్రి వెల్లడించారు.

పరీక్షకు హాజరైన అభ్యర్థులు బీటెక్‌ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం మే 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈసెట్ – 2024 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది టీఎస్ ఈసెట్ 2024 ప్రవేశ పరీక్షను ఉస్మానియా వర్శిటీ నిర్వహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News