Thursday, February 6, 2025

ఎడ్‌సెట్‌ షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ ఎడ్‌సెట్‌ షెడ్యూల్ విడుదల అయ్యింది. గురువారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్‌సెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.ఇక, మార్చి 12 నుంచి మే 13వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఎడ్‌సెట్‌ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. జూన్‌ 1న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఎడ్‌సెట్‌ పరీక్ష జరగనున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది.

పీఈ సెట్‌ షెడ్యూల్:

ఎడ్‌సెట్‌ షెడ్యూల్ తోపాటు పీఈ సెట్‌ షెడ్యూల్ కూడా విడుదల చేసింది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి. మార్చి 12న నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. మార్చి 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. లేట్ ఫీజుతో మే 30 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జూన్‌ 11 నుంచి 14 వరకు పీఈ సెట్‌ పరీక్షలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News