- Advertisement -
హైదరాబాద్: విద్యా ప్రామాణికత పెంచేందుకు గాను రాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. చైర్మన్, ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది.
వీరిని త్వరలో నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలని సిఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా ఈ రోజు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
- Advertisement -