Monday, December 23, 2024

నేటితో మూగబోతున్న మైకులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/తాండూరు : ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతోనే ముగియనుంది. పోలింగ్‌కు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. నాయకుల గుండెల్లో టెన్షన్….. టెన్షన్‌గా ఉంది. గత రెండు నెలల పాటు ప్రచారం చేపట్టిన వివిధ పార్టీల నాయకులు ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారోననే భయంలో ఉన్నారు. తాండూరులో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేపట్టాయి. నువ్వా…. నేనా అనే కోణంలో ప్రచారంలో ముందడుగు వేశాయి. తాండూరు నియోకవర్గంలో 2,28,515 ఓటర్లు ఉన్నారు. గతంలో కంటే ఈ సారి ఓటర్లు అదనంగా చేరారు. అయితే ప్రతి సారి తాండూరులో మూడు పార్టీలు ఎక్కువగా గట్టి పోటీ ఉండేది. ఈ సారి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీల మద్యనే పోటీ ఉంది. బిజేపి పార్టీ అభ్యర్థి లేకపోవడంతో అలయిన్స్‌గా ఉన్న జనసేన పార్టీకి తాండూరు టిక్కెట్ కేటాయించడంతో ఎలాంటి పోటీ కనిపించలేకపోయింది. ఇప్పటి వరకు ప్రచారం ఒక ఎత్తు అయితే ఇకపై ఎత్తులు, పై ఎత్తులు వేసేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణంతోపాటు తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల మండలాల్లో ఓటర్లను తమ వైపు మళ్లించుకునేందుకు అభ్యర్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఇ ప్పటికే తెరాస పార్టీ నుండి సిఎం కేసిఆర్ తాండూరులో ప్రచార సభ నిర్వహించారు. మండలాల్లో పబ్లిక్ మీటింగ్‌లు పెట్టారు. రోడ్డు షోలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పబ్లిక్ మీటింగ్‌లు అసలు పెట్టలేదు. రోడ్డుషోలు, ప్రచారం మాత్రం నిర్వహించింది. పోలింగ్ సమయానికి ఒక రోజు ముందుగానే ప్రచారం ముగియటంతో అభ్యర్థులు ఓటర్లు తమకే ఓటు వేసే విధంగా స్థానిక నాయకులు, అనుచరులతో ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటు మనకే పడాలని బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఓటర్లు మాత్రం గ్రామాల్లో, పట్టణంలో ఎవరు సమావేశాలు పెట్టినా ఓట్లు అడిగినా మా ఓటు మీకేనని తల ఊపుతున్నారు. తాము కోట్లాది రూపాయలతో అభివృద్ది చేపట్టినందుకు ఓట్లు తమకే వేస్తారని బిఆర్‌ఎస్ నాయకులు ఆశిస్తున్నారు. అయితే తాండూరులో ఎ లాంటి అభివృద్ధ్ది జరగ లే ద ని, నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తోందని కాంగ్రెస్ నాయకులు ఓటర్ల వద్దకు వెళ్లుతున్నా రు. ఏది ఏమైనప్పటికి ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారనేది వేచిచూడాల్సిందేనని పలువురు మేదావులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News