హైదరాబాద్ ః అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణం కావడంతో సోమవారం నాటికి ఎన్నికల కోడ్ ముగిసింది. నేటి నుంచి ప్రజల కష్టాలు తీరడమే కాకుండ అన్ని విభాగాల్లో సాధారణ పరిపాలన కొనసాగనుంది. భారత ఎన్నికల కమిషన్ అక్టోబర్ 9న అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్‌ను వెలువరించిన మరు క్షణం నుంచే కోడ్ అమల్లోకి వచ్చింది. అప్పటీ నుంచి మొదలైన ప్రజల కష్టాలు సోమవారంతో పూర్తిగా తీరిపోయ్యాయి. కోడ్ నేపథ్యంలో గత 54 రోజులుగా సాధారణ పారిపలన పూర్తి ప్రభావం పడంది. అత్యవసర సేవలు తప్ప మిగిలిన పనులు చేయాలన్నా ఆంక్షలు అమల్లో ఉండడంతో ప్రజలు కొంత ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీనికి తోడు అధికార యంత్రాంగం సైతం ఎన్నికల విధులపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించడం,
మరోవైపు ఎన్నికల విధులతో సంబంధం లేని పలువురు ఉద్యోగులు సైతం ఆ సాకుతో ఆఫీసు పనులు పక్కన పెట్టడంతో ఒక్క విధంగా పాలనే కుంటి పడి పోయింది. మరో వైపు కోడ్ నిబంధనల ప్రకారం పలు ఆంక్షలు అమల్లో ఉండడంతో బడా వ్యాపారులు, మొదలు వీధి వ్యాపారుల వరకు ఇబ్బందులు తప్పలేదు. మరోవైపు ఎన్నికల అక్రమ ధనం వినియోగాని అరికట్టేందుకు గడిచిన 50 రోజులు పాటు పోలీసులు, ప్లయింగ్ స్వాడ్ బృందాలు ఎక్కడికక్కడ తనిఖీలను నిర్వహించడం, దీంతో సాధారణ ప్రజలకు సైతం ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.. అయితే ఎన్నికల కోడ్‌ను ఎన్నికల కమిషన్ పూర్తిగా ఎత్తి వేయడంతో మంగళవారం నుంచి నగరంలో సాధారణ పరిస్థితలు నెలకొనున్నాయి .