Sunday, January 19, 2025

ఏఐసిసికి కత్తి మీద సాములా… అభ్యర్థుల ఎంపిక!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గతంతో పోల్చితే ఈసారి అత్యధిక మంది కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వెయ్యికి పైగా వచ్చిన దరఖాస్తుల నుంచి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జాబితాను స్క్రీనింగ్ కమిటీ ఫిల్టర్ చేయనుంది. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అయితే మెజారిటీ నియోజకవర్గాల్లో కనీసం ఇద్దరి నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీ, ఏఐసిసికి కత్తి మీద సాములా మారింది. స్క్రీనింగ్ కమిటీ మూడు సమావేశాలు జరిపినా ఎంపిక ప్రక్రియ కొలిక్కి రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో టికెట్ల ఎంపిక తర్వాత మిగతా అసంతృప్తులు పార్టీ నుంచి చేజారిపోకుండా సీనియర్ నేత జానారెడ్డి కమిటీ బుజ్జగింపులు చేసి భరోసా కల్పించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News