- Advertisement -
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ, ఫలితాల వెల్లడి గురించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ వివరించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు తుది ఫలితాలను ప్రకటిస్తామన్నారు. కొన్ని నియోజకవర్గాలలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడం, కొన్ని చోట్ల భారీగా పోలింగ్ జరగడంవల్ల కౌంటింగ్ ప్రక్రియ, ఫలితాల వెల్లడి ఆలస్యం కావచ్చునని ఆయన చెప్పారు.
ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలువుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తరువాత 8.30 గంటలకు ఇవిఎమ్ లలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం పడితే, 8.30 గంటల తర్వాత పోస్టల్ బ్యాలెట్లతోపాటు ఇవిఎం ఓట్లను కూడా చేపడతారు. 49 కౌంటింగ్ కేంద్రాలలో 1766 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
- Advertisement -