Monday, December 23, 2024

ఇంటింటి ప్రచారం రథమెక్కింది..!

- Advertisement -
- Advertisement -

ఎన్నికల పుణ్యమాని రెండుచేతులా సంపాదిస్తున్న ప్రచార రథం తయారీదారులు, ఒక్కో ప్రచార రథం తయారీకి లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు, ఒక్కో అభ్యర్థి 5 నుంచి 10 వాహనాల వరకు ఆర్డర్లు

ఊరూ, వాడ, పల్లె, పట్టణంలో ఊపందుకున్న ప్రచారం

(ఎల్. వెంకటేశం/మన తెలంగాణ):  సమయం తక్కువగా ఉండటంతో ఇంటింటి ప్రచారం రథమెక్కింది. ఊరూ, వాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రచారం ఊపందుకుంది. పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. మైకుల మోతలతో ప్రచారం హోరెత్తుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను చుటి రావాలంటే ఏ పార్టీకైనా ప్రచార రథాలే కీలకం. అందుకే ఆయా పార్టీల అభ్యర్థులు ముందస్తుగానే వీటిని తయారు చేయించుకున్నారు. దీంతో ఈసారి ప్రచార రథాలకు డిమా ండ్ పెరిగింది. కార్పెంటర్లు, ఫ్లెక్సీ డిజైనర్లు, ఆర్టిస్ట్‌లు వాటి తయారీలో బిజీ అయ్యారు. ఎన్నికల పుణ్యమాని రెండు చేతులా పని దొరికిందని తయారీదారులు పేర్కొనడం విశే షం. అయితే ఒక్కో అభ్యర్థి 5నుంచి 10 వాహనాలను తయా రు చేయించుకున్నారని తయారీదారులు పేర్కొంటున్నారు.

సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసి…

ఎన్నికల ప్రచారంలో ప్రచార రథాలదే కీ రోల్‌గా మారింది. కొందరు సొంత వాహనాలకే డిజైన్లు చేయించగా, ఇంకొందరు అద్దెకు తీసుకున్నారు. మరికొందరు సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేసి ప్రచార రథాలుగా తయారు చేయించుకొని వాటిపై ప్రచారం మొదలుపెట్టారు. కుత్బుల్లాపూర్ సూరారం పారిశ్రామికవాడ, ముసారంబాగ్, నాంపల్లి, వరంగల్, కరీంనగర్, అంబర్‌పేట, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, ఎపిలోని గుంటూరు తదితర ప్రాంతాల్లో పార్టీల ప్రచార రథాల తయారీ జోరుగా కొనసాగింది. ఎన్నికలు ఏవైనా ప్రచార రథాలను ఇక్కడ తయారు చేస్తుంటారు. ఒక్కో వాహనానికి డిజైన్ చేయడానికి సుమారు లక్ష నుంచి రెండున్నర లక్షల వరకు అభ్యర్థులకు ఖర్చు చేశారు. ఒక్కొక్కరు తమ ప్రచారానికి అనుగుణంగా రూ.5 లక్షల వరకు ఖర్చు పెట్టడం గమనార్హం. ఈసారి ఎన్నడూ లేని విధంగా భారీగా ఆర్డర్లు వచ్చాయని రథాలను ప్రచారం చేసే వారు పేర్కొనడం గమనార్హం.

అవసరాన్ని బట్టి నెలవారీ ప్రాతిపదికన…

పార్టీల అగ్రనేతలతో పాటు నియోజకవర్గస్థాయి నేతలు, అభ్యర్థులు కూడా తమకు అనుకూలంగా ప్రచార రథాలు సిద్ధం చేయించుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు చాలామంది తమ ప్రచార వాహనాలు సిద్ధం చేయించుకున్నారు. ప్రచార వాహనాల్లో మైక్ సెట్లు, సౌండ్ సిస్టమ్, ఎల్‌ఈడీ స్క్రీన్ వంటి ఫీచర్లను ఏర్పాటు చేయించుకున్నారు. అయితే ఈ ప్రచార వాహనాలను బుక్ చేసుకోవడంలో బిజెపి నేతలు అందరికంటే ముందుండడం విశేషం. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వాహనాల సరఫరాదారులు పొరుగు రాష్ట్రాల నుంచి ఈ ప్రచార రథాలను అద్దెకు తీసుకొచ్చి అభ్యర్థులకు ఇచ్చారు. నేతల్లో కొందరు అవసరాన్ని బట్టి నెలవారీ ప్రాతిపదికన అద్దెకు తీసుకోగా, ఇంకొందరు ఎన్నికలు అయ్యేంత వరకు ఒకేసారి బుక్ చేసుకుంటున్నారు. అయితే నేతలకు అవసరమైన విధంగా ఈ వాహనాల్లో మార్పులు, చేర్పులు చేశారు.

కొత్తపుంతలు తొక్కుతున్న ప్రచారం…

అభ్యర్థులు ఆకర్షణీయమైన ప్రచార రథాలను తయారు చేయించుకున్నారు. టెక్నాలజీ పెరగడంతో ఈ రథాల రూపురేఖలు కొత్తపుంతలు తొక్కాయి. డిజిటల్ ఫ్లెక్సీలను రథాలకు అమర్చుకున్నారు. ప్రధాన పార్టీలు, చిన్న పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు వీటిని సిద్ధం చేయించుకున్నారు.

టాటా ఏస్, డిసిఎం, గూడ్స్ ఆటోలు…

అభ్యర్థుల అభిరుచులకు తగ్గట్టుగా అశోక్‌లేలాండ్, టాటా ఏస్, డిసిఎం, గూడ్స్ ఆటోలకు సరికొత్త హంగులను జోడిం చి ప్రచార రథాలుగా తయారీదారులు మార్చారు. పార్టీ గుర్తులు, సంక్షేమ పథకాలు, నాయకుల పేర్లు కనిపించేలా వాటిని తీర్చిదిద్దారు. ఒక్కో అభ్యర్థి మూడు, నాలుగు వాహనాలను సిద్ధం చేయించుకుంటున్నారు. వీటితో పాటు ఫ్లెక్సీలు, కండువాలు, జెండాలు, టోపీలు, టీ షర్టులకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది.

మహేంద్ర, సుజికి వాహనాలకు డిమాండ్…

ప్రచారరథం పైకి ఎక్కితే వాటిలో సకల సౌకర్యాలు ఉండేలా అభ్యర్థులు ఏర్పాటు చేయించుకున్నారు. 250 వాట్స్ ఆహు జ మైక్‌లతో పాటు రథానికి నాయకుల చిత్రపటాలు, కార్డులెస్ మైకు, కార్డుతో కూడిన మైకు రథంపై ఐదు నుంచి పది మంది ముఖ్యులు నిల్చోనేలా డయాస్, టైటిల్స్, చుట్టూ రెయిలింగ్స్, వాటర్ ప్రూఫ్ కార్పెట్లు, పైన నిలబడి మాట్లాడే నాయకుడు కనిపించేలా లైట్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రచార రథాల తయారీకి ఈసుజు సుజికి వాహనాలను ఎక్కువగా వాడుతున్నారు. గతంలో ప్రచారంలో ఉన్న మహే ంద్ర, రాజు సుజికి ఫమని రథాల తయారీకి ఈసుజు సుజికి వాహనాలను ఎక్కువగా వాడుతున్నారు. గతంలో ప్రచారం లో ఉన్న మహేంద్ర, బోలోరో వాహనాలకు బదులు వీటిని వినియోగిస్తున్నారు. తమ పార్టీల అధినేతల ఫొటోలు, గుర్తులతో ఆకర్షించేలా రథాలను వారు చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News