Thursday, December 19, 2024

మధ్యాహ్నం 1 గంటల వరకు 36.68 శాతం పోలింగ్..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సమయం గడిచేకొద్దీ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. ఉదయం 10 గంటల సమయానికి 11 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కాగా, 11 గంటల సమయానికి 20.64 శాతానికి చేరుకుంది. మధ్యాహ్నం 1 గంటల వరకూ 38శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 55 శాతం మేరకు పోలింగ్ జరగగా.. హైదరాబాద్ లో అత్యల్పంగా 21 శాతం పోలింగ్ మాత్రమే నమోదైనట్లు చెప్పారు.

సాయంత్ర 5 గంటల వరకే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద జనాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల నేపథ్యంలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News