Sunday, January 19, 2025

సునీత రెడ్డి కుమారుడిపై తండా వాసుల దాడి.. నర్సాపూర్ లో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

నర్సాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ పోలింగ్ నేపథ్యంలో అక్కడిక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు వాహనాలపై కర్రలు రాళ్లతో దాడులు చేయడంతో హింసాత్మక ఘటనలకు దారితీసాయి. గురువారం ఉదయం బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి చిన్న కుమారుడు శశిధర్ రెడ్డి.. కౌడిపల్లి మండల పరిధిలోని బిట్ల తండా గ్రామంలో జరుగుతున్న పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి పోలింగ్ సరళి పరిశీలిస్తున్న క్రమంలో తండా వాసులు అడ్డుకున్నారు. ఇదే విషయంలో మాట మాట పెరగడంతో ఆగ్రహించిన తండావాసులు శశిధర్ రెడ్డి ఇన్నోవావాహనంపై రాళ్ల దాడి చేయడంతో వాహనం ముందు భాగంలోని అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇదే విషయమై ఆయన కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

కాంగ్రెస్ నాయకుడి పై దాడి
బుధవారం రాత్రి శివంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుధీర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కమల పుల్ సింగ్ తదితరులు ఎన్నికల పోలింగ్ సంబంధించిన ఏజెంట్ సామ్లాలను ఇవ్వడానికి మండల పరిధిలోని భీమ్లా తండాలకు వెళ్లి సామ్లాలను ఇచ్చి తిరిగి వస్తున్న క్రమంలో స్థానిక సర్పంచ్ కాట్రోత్ చిన్న కేతావత్ సురేష్, కేతవత్ నరేష్ గుగులోతు దేవేందర్‌లతో పాటు మరి కొంతమంది సుధీర్ రెడ్డి స్కార్పియో వాహనంపై రాళ్లు కర్రలతో దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో భయాందోళన చెందిన సుధీర్ రెడ్డి వాహనంతో పాటు మాజీ జెడ్పీటీసీ కమలాపుల్ సింగ్ వాహనాలను అక్కడే వదిలేసి పరుగులు తీసి ఇంటికి వెళ్ళిపోయారు. విచారణ చేసి అక్రమంగా తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుధీర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News