Thursday, December 26, 2024

మ్యానిఫెస్టోలోని 90శాతం హామీలను అమలు చేశాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దరిదాపుల్లో ఏ రాష్ట్రం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన ‘తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ అవార్డుల పంట పండిస్తోంది. కేసీఆర్ రాజీలేని పాలన సాగిస్తున్నారు. మానిఫెస్టోలో పెట్టి 90శాతం హామీలను అమలు చేశాం. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా.. రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేశాం. కేసీఆర్ విజన్ వల్లనే విద్యుత్ కొరతను అధిగమించాం. కోతలు లేకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. పట్టణాల్లో ఉండే అన్నీ సౌకర్యాలను గ్రామాల్లో అభివృద్ధి చేశాం.కాంగ్రెస్ నాయకులు మూడు గంటలే కరెంటు ఇస్తామంటున్నారు.ధరణిని రద్దు చేస్తామంటున్నారు.ప్రస్తుతం కర్నాటకలో రెండు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మళ్లీ కరెంటు కష్టాలు వస్తాయి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బిఆర్ఎస్ గెలిస్తేనే సాధ్యమవుతుంది” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News