Sunday, January 19, 2025

తెలంగాణ రక్షణ కేసీఆర్ వల్లే సాధ్యం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ పై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. శనివారం బాచూపల్లిలో కేఎల్ యునివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని అనంతరం మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక సీఎం సిద్దారామయ్య, డిప్యూటీ సీఎం డికె శివకుమార్ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారని..ఏమి చూసి ఓటు వేయాలని ప్రశ్నించారు. మీ వద్ద రోజూ ఆత్మహత్యలు జరిగితుంటే.. ఏం ముఖం పెట్టుకొని ఇక్కడికొచ్చి ఓట్ల అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

5 గంటల కరెంట్ ఇస్తున్నామని మొన్న డికె శివకుమార్ ఒప్పుకున్నారని.. మీ ఇల్లు సక్కగా లేదు, ఇక్కడకు వచ్చి నీతులు చెబుతున్నారని విమర్శించారు.కాంగ్రెస్ లో టికెట్లు కావాలంటే ఢిల్లీ వెళ్లాలని.. తెలంగాణకు కర్ణాటక నుంచి డబ్బులు తరలిస్తున్నాని ఆరోపించారు. ఇక్కడి నేతలకు చేతకాదని.. ఇతర రాష్ట్రాల నుండి నాయకులను ప్రచారానికి తీసుకువస్తున్నారన్నారు.

కాంగ్రెస్ వస్తే.. తెలంగాణపై ఢిల్లీ, కర్ణాటక పెత్తనం ఉంటుందన్నారు. కృష్ణా జలాలు, ఐటి వివాదాలు వస్తే.. మన హక్కులను కాంగ్రెస్ కాపాడుతుందా? అని ప్రశ్నించారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ పంచాయి ఉందని… ఎటు వైపు ఉంటారని.. కర్నాటకను ఎదిరించే దమ్ము, ధర్యం తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఉందా? అని అన్నారు. కాళ్ళు మొక్కేవాళ్లు, అడుగులకు మడుగులు ఒత్తే వాళ్ళు తెలంగాణ ప్రయోజనం కాపాదుతరా?.. తెలంగాణ రక్షణ కేసీఆర్ వల్లే సాధ్యం అవుతుందని హరీష్ రావు అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News