Monday, December 23, 2024

తెలంగాణలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఈరోజు(గురువారం, నవంబర్ 30) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈక్రమంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంతో ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8.52 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యమవుతోంది. మరికొన్ని చోట్ల రాజకీయపార్టీల కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకువడంతో ఉద్రిక్తత నెలకొంది.

కాగా, సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కొనసాగనుంది. సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్‌ జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News