Friday, December 20, 2024

తెలంగాణలో పోలింగ్ డే: కిక్కిరిసిన ఓఆర్ఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో పోలింగ్ డే కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంరంభం నెలకొంది. పోలింగ్ కేంద్రాల వద్ద హడావిడి కనిపిస్తోంది. స్వస్థలాలకు వెళ్లి ఓట్లు వేయాలనుకునేవారు ఉదయమే ప్రయాణం మొదలెట్టడంతో రోడ్లు, జాతీయ రహదారులు కిక్కిరిసిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాల నత్తనడకతో సొంత ఊళ్లకు వెళ్లి ఓటేయాలనుకునేవారు సకాలంలో ఓటేస్తామా లేదా అని ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్-విజయవాడ హైవే కూడా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్- ఇబ్రహీంపట్నం రోడ్డుపై  వాహనాల రద్దీ అధికంగా ఉంది. నకిరేకల్, తుంగతుర్తి, సూర్యాపేట, నాగార్జునసాగర్, కోదాడ నియోజకవర్గాలకు హైదరాబాద్ నుంచి ఓటర్లు కార్లలో బయల్దేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News