Sunday, December 22, 2024

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్ గల్లంతు: కెఎ పాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని గతంలో జరిగిన మునుగోడు, హుజురాబాద్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కెఏ పాల్ పేర్కొన్నారు. బిజెపి రాష్ట్రంలో అసలే లేదని తమ పార్టీ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బానిస బతుకు వద్దని, ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆఫర్ ఇచ్చారు. శుక్రవారం పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

అధికార పార్టీ నేతలు దానం నాగేందర్, తాత మధు ఎలక్షన్ కమిషన్‌ను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దానం నాగేందర్ తనకు అనుకూలమైన వారికి తప్ప వేరే వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వమని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఆశావాహులు అందరూ రూ.10 వేలు కట్టి పార్టీ బీ ఫామ్ పొందాలని పిలుపునిచ్చారు. పోలీసులకు కూడా అండగా ప్రజాశాంతి పార్టీ ఉందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News