Tuesday, December 24, 2024

కాంగ్రెస్ పై కేటీఆర్ సెటైర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఎద్దేవా చేస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకోసారి ముఖ్యమంత్రి మారడం మాత్రం ఖాయమన్నారు. ఐదేళ్లలో పదిమంది ముఖ్యమంత్రులు మారతారని కేటీఆర్ చెప్పారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల, పరిగిలో నిర్వహించిన రోడ్ షోలలో ఆయన మాట్లాడారు.

తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని కేటీఆర్ అన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం అందజేస్తామని హామీ ఇచ్చారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక సౌభాగ్యలక్ష్మీ పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు మూడువేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అసైన్డ్ భూములపై దళితులు, గిరిజనులకు పూర్తి హక్కులు కల్పిస్తామని చెప్పారు. కుల్కచర్లకు కృష్ణానది నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తనదని కేటీఆర్ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News