Monday, December 23, 2024

రాహుల్ గాంధీ.. ఎప్పుడైనా పోటీ పరీక్షలు రాసినవా? ఇంటర్వ్యూకు వెళ్లినవా?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం చేసావా..? ఉద్యోగం చేసావా..? యువత ఆశలు ఆకాంక్షలు తెలుసా..? పోటీ పరీక్షలు రాసినవా.? ఇంటర్వ్యూకు వెళ్లినవా..? ఉద్యోగార్థుల ఇబ్బందులు నీకు ఏమన్నా అర్థమైతయా..? అని రాహుల్‌గాంధీని కెటిఆర్ నిలదీశారు. 95 శాతం ఉద్యోగాలు స్థానిక బిడ్డలకే దక్కేలా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చిన నిబద్ధత తమది అని అన్నారు. మా కొలువులు మాకే దక్కాలన్న ఉద్యమస్ఫూర్తిని నిలబెట్టి నియామకాల నినాదాన్ని నిజం చేసిన వాస్తవాన్ని కాదనగలవా..? అని ప్రశ్నించారు. 1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధలను సమర్థిస్తూ తీర్పునిస్తే..పార్లమెంట్‌లో చట్టం చేసి ముల్కీ రూల్స్‌ను రద్దుచేసి.. తెలంగాణ స్థానికత హక్కులకు సమాధి కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా..? అని ప్రశ్నించారు.

ఆరుసూత్రాలు..610 జిఒలు.. గిర్‌గ్లానీ నివేదకలు తుంగలో తొక్కి..హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా మార్చేసి..నాన్ లోకల్ కోటాలు పెట్టి..తెలంగాణ యువతకు దక్కాల్సిన కొలువులను కొల్లగొట్టి తీరని అన్యాయం చేసిన ద్రోహులు మీరు కాదా..? అని నిలదీశారు. కాంగ్రెస్ పనికిమాలిన పాలనలో ఉపాధిలేక..ఉద్యోగాల్లేక నిరాశ నిస్పహలతో తెలంగాణ యువత తుపాకులు చేతబట్టి అడవిబాటపట్టి నక్సలైట్లలో చేరింది నిజమా..? కాదా..? అని ప్రశ్నించారు. వేలమంది యువకుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపి.. ఎన్‌కౌంటర్ల పేరుతో నిత్యం నెత్తుటేర్లు పారించిన కర్కశమైన పాలన మీది కాదా..? అని నిలదీశారు.

కాంగ్రెస్ కాలంలో ఎపిపిఎస్‌సి అక్రమాలకు అడ్డాగా మారి..అంగట్లో బేరంపెట్టి కొలువులను అమ్ముకోలేదా..?, ప్రాంతీయ వివక్షతో..ఇంటర్వ్యూల ముసుగులో తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాకుండా చేసింది నిజం కాదా..అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1952లో నాన్ ముల్కీ గోబ్యాక్..ఇండ్లీ సాంబార్ గో బ్యాక్ అని నినదించిన విద్యార్థులపై తూటాలు పేల్చి..ఏడుగురు తెలంగాణ ముద్దు బిడ్డల్ని చంపిన దుర్మార్గులు..దోషులు మీరు కాదా..?, 1969లో జై తెలంగాణ అని నినదించిన 369 మంది యువకిశోరాల గుండెల్లో తుపాకి గుండ్లు దించి పొట్టనపెట్టుకున్న నర హంతకులు మీరు కాదా..? అని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశిస్తూ కెటిఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News