Thursday, December 19, 2024

ఓటు వేయాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఈసారి ఎలక్షన్స్ రసవత్తరంగా మారాయి. గత నెల రోజులుగా హోరాహోరిగా రాజకీయ పార్టీల ప్రచారాలు సాగాయి. నిన్నటి(మంగళవారం, నవంబర్ 28)తో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. రేపు నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ జరగనుండడంతో హైదరాబాద్ తోపాటు పలు పట్టణాల నుంచి ప్రజలు ఓటేసేందుకు తమ సొంతూర్లకు పయనమవుతున్నారు. దీంతో ప్రజలు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఈసారి దాదాపు నాలుగు లక్షలకు పైగా మంది తొలిసారి ఓటు వేయనున్నారు. అయితే, ఓటర్లు కొంచెం మిస్టెక్ చేసినా ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలో ఓటు వేసే ప్రాసెస్, తీసుకోవాల్సిన జాగ్రత్తేలేంటో ఓ సారి చూద్దాం.

*ఎన్నికల సిబ్బంది పంపిణి చేసిన ఓటరు స్లిప్ తోపాటు ఓటరు గుర్తింపు కార్డు తప్పకుండా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలి.   లేకపోతే ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతించరు.
*ఓటరు గుర్తింపు కార్డే అని కాకుండా.. ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డులల్లో ఏదో ఒకటి మీ వెంట   తీసుకెళ్లినా సరిపోతుంది.
*ఓటు వేయాలనుకునేవారు ముందుగా మీ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందో తెలుసుకోవాలి.
*అంతకంటే ముందు.. అసలు మీ పేరు ఓటరు జాబితాలో ఉందా?.. లేదో తెలుసుకోవాలి. అందుకుకోసం ఎలక్షన్ కమిషన్   వెబ్ సైట్ లో చూసుకోవాలి.
*పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, ఓటర స్లిప్ మాత్రమే తీసుకెళ్లాలి.
*ముబైల్ ఫోన్లు, ఇతర ఎటువంటి వస్తువులు కూడా తీసుకెళ్లకూడదు.
*పార్టీల గుర్తులు, కలర్లు కలిగిన దుస్తులు కానీ, కండువా, టోపీలు కానీ తీసుకెళ్లకూడదు. అలా కాదని ఓటు వేస్తే.. మీ    ఓటు లెక్కలోకి తీసుకోరు.

కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014, 2018లో వార్ వన్ సైడ్ గా అన్నట్లు కేసీఆర్, ప్రతిపక్షాలను చిత్తుగా ఓడించి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ.. ఈసారి అలా కాదు.. సీన్ రివర్స్ అయ్యింది.. ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అనూష్యంగా పుంజుకుంది. మరోవైపు బీజేపీ కూడా తన సత్తా చూపేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News