Monday, December 23, 2024

80స్థానాల్లో ద్విముఖ పోటీ

- Advertisement -
- Advertisement -

39 స్థానాల్లో త్రిముఖ పోటీ
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రత్యర్థి పార్టీల్లో రెబల్స్ ఉంటే తమకు లభిస్తుందని అన్ని పార్టీలు ఆశపడినా ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 80 స్థానాల్లో ద్విముఖ పోటీ నెలకొంటుండగా మరో 39 స్థానా ల్లో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. కాంగ్రె స్ పార్టీలో సహజ సిద్ధంగా ఉండే అసమ్మతిని రెబల్స్ పోటీ రూపంలో ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకోవాలనుకున్న పార్టీల ఆశలు అడియాశలయ్యే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి దాదాపు 20 స్థానాల్లో రెబల్స్ బరిలో దిగారు. వీరంతా సొంత పార్టీ ఓటు చీల్చగలవారే. అందుకు భిన్నంగా కాంగ్రెస్ వారిని బరి నుంచి తప్పించడంలో సక్సెస్ అయింది.

పటేల్ రమేశ్‌రెడ్డితో సహా వివిధ నియోజకవర్గాలలో తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసివారు తమ నామినేషన్లు ఉపసంహరించున్నారు. బిఆర్‌ఎస్, బిజెపిల నుంచి కూడ రెండుమూడు చోట్ల మినహా అన్ని చోట్ల రెబల్స్ అభ్యర్థులను ఉపసంహరింప చేయడంలో సఫలం అయ్యారు. గతానికి భిన్నంగా ఈ దఫా ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద లేకపోవడం విశేషం. తిరుగుబాటు అభ్యర్థులకు ప్రధాన పార్టీలు అధికారంలోకి వచ్చాక అనేక పదవులు వస్తాయని, వాటిల్లో అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పడంతో చాలామంది రెబల్స్ దారికొచ్చారు. దీంతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి డీలిమిటేషన్‌తో పెరిగే స్థానాల్లో తమకు అవకాశాలు దక్కకపోతాయా అన్న ఆశ కూడా రెబల్స్ పోటీ నుంచి తప్పుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News