- Advertisement -
తెలంగాణ రాష్ట్రశాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. పట్టిష్ట భధ్రతా ఏర్పాట్ల మధ్య రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయపార్టీలతో పాటు మొత్తం 2290మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 2417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కార్యక్రమ చేపట్టారు. అత్యధికంగా జూబ్లిహిల్స్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 26 రౌండ్లలో నిర్వహిస్తున్నారు. అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 13రౌండ్లలో పూర్తి కానుంది. ఉదయం పది గంటలకు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.
- Advertisement -