Wednesday, January 22, 2025

ప్రజల కష్టం తీర్చిన కరెంటు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అనేక సవాళ్లను ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటగా స్వీకరించారు. లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రణాళికలు వేశారు. ముందుగా సంస్థాగత సామర్థ్యాన్ని పెంచారు. సరఫరాలో పంపిణీలో జరిగే నష్టాలను బాగా తగ్గించుకోగలిగారు. నత్తనడక నడుస్తున్న భూపాలపల్లి, జూరాల, పులిచింతల, జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలను పరుగులు పెట్టించారు. అతి వేగంగా పూర్తయి ఉత్పత్తి ప్రారంభించే వరకు వెంటపడ్డారు. తెలంగాణలో పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్ అవసరం కాబట్టి, ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా ఎక్కడ కరెంటు అందుబాటులో ఉంటే అక్కడ నుంచి తీసుకున్నారు. ఉత్తరాది నుంచి కరెంటు పొందడానికి వీలుగా చత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొని పిజిసిఎల్ ద్వారా కొత్త లైన్ నిర్మాణం చేయించారు. కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రూపకల్పన చేశారు.

తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడితే అంధకారం అవుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి బెదిరింపులు. తెలంగాణ వస్తే విద్యుత్ ఎక్కడి నుండి వస్తుందన్న ప్రశ్నలు. విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలతాయని జోస్యాలు. కాని ఇవేవి నిజం కాదని ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం నిరూపించింది. ఏడేళ్లలో అనేక ఇబ్బందులు ఎదురయినా అవన్నీ ఎదుర్కొని ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ విద్యుత్ రంగం అద్భుత ప్రగతిని సాధించింది. తెలంగాణ ఏర్పడితే చీకటే అన్నవారి జోస్యం తప్పని నిరూపిస్తూ తెలంగాణ అంతటా విద్యుత్ వెలుగులు నింపుతోంది విద్యుత్ శాఖ. 2014 నాటి పరిస్థితులు ఓసారి అవలోకనం చేసుకుంటే విద్యుత్ కొరత ప్రధాన సమస్య. ఈ కోతలతో రైతులు, పరిశ్రమలు, గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గల్లీ నుండి అసెంబ్లీ వరకు విద్యుత్ కోతలపై చర్చలు, రోడ్లపై ధర్నాలు, పొలాలు ఎండిపోయి, బోర్లలో నీరు ఇంకిపోయి రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా ఉండేవి. రాష్ట్రం ఏర్పడే నాటికి పీక్ డిమాండ్‌కి 2,700 మెగావాట్లు విద్యుత్ లోటు ఉండేది.

రోజుకు నాలుగు నుంచి 8 గంటల వరకు గృహ అవసరాలతో పాటు, ఇతర వినియోగదారులకు కోతలు తప్పనిసరి. పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించే పరిస్థితులు ఉండేవి. వ్యవసాయ రంగానికి నాలుగు నుంచి ఆరు గంటల విద్యుత్ అందించడం కష్టంగా ఉండేది. అదీ నాణ్యమైన విద్యుత్ అందించలేని పరిస్థితి. మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోవడం వంటి సంఘటనలు తరచూ జరుగుతుండేవి. పంటలు ఎండిపోయి రైతుల ఆత్మహత్యల వార్తలు ప్రతీరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపించే పరిస్థితులు ఉండేవి. రాత్రిపూట విద్యుత్ ఇవ్వడం వల్ల రైతులు కరెంటు షాక్ తగిలి చనిపోవడం, పాము కాటుకు గురయి రైతులు చనిపోయిన సంఘటనలు కోకొల్లలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉంది.

నిత్యం కరెంటు కోతలు, పవర్ హాలిడేలు విధించేవారు. హైదరాబాద్ నగరంలో రోజు రెండు నుంచి నాలుగు గంటలు, పట్టణాల్లో ఆరు గంటలు, గ్రామాల్లో 12 గంటలు విద్యుత్తు కోతలు అమలు అయ్యేవి. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు ఉండేవి. కావలసినంత కరెంటు లేకపోవడంతో పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడ్డవి. కరెంటు కోసం నిత్యం ధర్నాలు జరిగేవి. హైదరాబాదులో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడే వాతావరణం ఉండేది.

వ్యవసాయానికి రెండు, మూడు గంటలు కరెంటు కూడా అందకపోవడంతో పంటలు ఎండిపోయేవి. భూగర్భంలో నీళ్లుఉన్నా తోడుకునేందుకు కరెంటు లేక చేతికి వచ్చిన పంట కళ్ళేదుటె నాశనం అయ్యేది. లో వోల్టేజ్ సమస్యల వల్ల నిత్యం మోటర్లు కాలిపోయేవి. ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయేవి. నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో కూడా ఈ దుస్థితి కొనసాగింది. విభజన చట్టంలో ఇవ్వాల్సిన కరెంటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అనేక సవాళ్లను ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటగా స్వీకరించారు. లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రణాళికలు వేశారు. ముందుగా సంస్థాగత సామర్థ్యాన్ని పెంచారు. సరఫరాలో పంపిణీలో జరిగే నష్టాలను బాగా తగ్గించుకోగలిగారు.

నత్తనడక నడుస్తున్న భూపాలపల్లి, జూరాల, పులిచింతల, జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలను పరుగులు పెట్టించారు. అతి వేగంగా పూర్తయి ఉత్పత్తి ప్రారంభించే వరకు వెంటపడ్డారు. తెలంగాణలో పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్ అవసరం కాబట్టి, ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా ఎక్కడ కరెంటు అందుబాటులో ఉంటే అక్కడ నుంచి తీసుకున్నారు. ఉత్తరాది నుంచి కరెంటు పొందడానికి వీలుగా చత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొని పిజిసిఎల్ ద్వారా కొత్త లైన్ నిర్మాణం చేయించారు. కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రూపకల్పన చేశారు. వ్యవసాయ సాగుకు తగినంత నీరు, బోరు లేదా బావుల ద్వారా అందుబాటులో ఉన్నప్పటికీ నిరంతర కరెంటు కోతల వల్ల వ్యవసాయాన్ని సాగు చేసుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన సమస్య విద్యుత్ కనుక ప్రభుత్వం వ్యవసాయానికి 2018 జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా అందిస్తున్నది. రాష్ట్రంలోని మొత్తం 24.16 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలతో పాటు నిరంతరాయంగా నాణ్యమైన, ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కొత్త చరిత్రను లిఖించింది.

తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న 16 రాష్ట్రాల్లో సగానికి పైగా బిజెపి పాలిత రాష్ట్రాలే, తెలంగాణలో అప్పుడప్పుడు ట్రిప్పింగ్, ట్రాన్స్‌మిషన్‌తో చిన్నపాటి అంతరాయాలు మినహా పెద్దగా కరెంటు సమస్య లేదు. సరైన ప్రణాళిక, బొగ్గు వనరులు సమర్థవంతమైన నిర్వహణ కారణంగా మాత్రమే తెలంగాణ తన గరిష్ఠ డిమాండ్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు డిమాండ్‌ను తీర్చడానికి గ్రీడ్ నుండి భారీగా విద్యుత్తును డ్రా చేస్తున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్లకు తగినంత బొగ్గు లభ్యత కోసం కేంద్రాన్ని అభ్యర్థించాయి. ప్రస్తుతం ఎపిలోని మెజారిటీ థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు కేవలం రెండు రోజులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తున్నది.

విద్యుత్ ఉత్పత్తి చేయడంలో ఎపి తన సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడంలో ఎలాంటి పురోగతి సాధించలేదు. తెలంగాణ విషయానికొస్తే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 2014లో 7,778 మెగావాట్ల నుంచి 2022లో 17,228 మెగావాట్లకు పెరిగింది. సోలార్‌పవర్‌ను 74 వాట్ల నుంచి 4,512 మెగావాట్లకు పెంచింది ప్రభుత్వం. ఎండాకాలం రావడంతో కొన్ని రోజులుగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. అయినా ఎటువంటి లోటు లేకుండా 204.566 మిలియన్ యూనిట్లు గరిష్ఠ డిమాండ్ ను తీర్చింది.

తెలంగాణలోని అన్ని థర్మల్ పవర్ ప్లాంట్లలలో తగినన్ని బొగ్గు నిల్వలను ఉంచుకోవడం ద్వారా బొగ్గు కొరతను అధిగమిస్తుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అవసరాలను తీరుస్తూ బొగ్గు సరఫరాకు సంబంధించినంత వరకు రాష్ట్రం బాగానే ఉంది. అన్ని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కనీసం రెండు వారాల పాటు బఫర్ స్టాక్ ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్లకు వెన్నెముకగా ఉంది. పొరుగునున్న ఇతర ఎనిమిది రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ట్రాన్స్‌మిషన్ నష్టాల్లో ఆరేండ్లలో 15.28 శాతానికి తగ్గించగలిగింది. అదే జాతీయ స్థాయిలో 2019-2020లో 20.46% నష్టాలు ఉన్నా యి. దేశంలోనే అతి తక్కువ ట్రాన్స్‌మిషన్ నష్టాలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 4వ స్థానంలో, దక్షిణాదిలో రెండవ స్థానంలో నిలిచింది. 24 గంటల విద్యుత్తును అన్ని రంగాలకు ఇస్తుండడంతో వినియోగదారుల్లో నమ్మకం పెరిగింది. విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 39,519 మిలియన్ యూనిట్ల వినియోగం ఉంటే, 2021- 2022 నాటికి 61,267 మిలియన్ యూనిట్లకు చేరింది. తలసరి విద్యుత్ వినియోగంలోనూ గణనీయ ప్రగతి సాధించింది.

రాష్ట్రం ఏర్పడినప్పుడు 1,356 యూనిట్ల వినియోగం ఉండగా, 2021 22 నాటికి 2,126 యూనిట్లకు చేరుకున్నది. సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2021- 22 నాటికి 4,432 మెగావాట్లకు చేరుకొని 8 ఏళ్లలో 59 రెట్లు పెరిగింది. ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీని పక్కాగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గత తొమ్మిదేళ్ల లో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో మిరుమిట్లు గొలిపే అభివృద్ధి సాధించింది. ఒక దేశం, ఒక రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తున్నదని చెప్పడానికి నిర్దేశించిన ప్రమాణాల్లో విద్యుత్ రంగం అత్యంత కీలకమైనది. అలాంటి రంగంలో దేశానికే స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక ముఖచిత్రం 2023లోని గణాంకాలు తెలంగాణ విద్యుత్తు రంగంలో సాధించిన ప్రగతిని కండ్లకు కడుతున్నాయి. 8 ఏళ్లుగా సిఎం కెసిఆర్ మార్గదర్శనం ట్రాన్స్‌కో, జెన్‌కో తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు సాధించిన కృషితో స్థాపిత విద్యుత్ సామర్థ్యం అనేక రెట్లు పెరిగింది. దేదీప్యమానంగా విద్యుత్ 9 ఏళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించింది. తలసరి లభ్యత వినియోగంలోనూ అగ్రస్థానంలో ఉంది. అందుకే తెలంగాణ విద్యుత్తు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచింది.

మోటె చిరంజీవి
9949194327

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News