Thursday, January 23, 2025

విద్యుత్ బిల్లులపై క్యూఆర్ కోడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ జారీ చేసే విద్యుత్ బిల్లులపై క్యూఆ కోడ్‌ను ముద్రించనున్నారు. తమ మొబైల్ ఫోన్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి వినియోగదారులు తమ బిల్లులు చెల్లించవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ తో కూడిన బిల్లులు వచ్చే నెల నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఆర్‌బిఐ కొత్త నిబంధనల వల్ల కొన్ని థర్డ్ పార్టీ యాప్స్‌లో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయం లేకున్నా ప్రస్తుతానికి బిల్లు వసూళ్లపై ప్రభావం పడలేదు.

శుక్రవారం ఉదయం పది గంటల వరకు దాదా పు 1.20 లక్షల వినియోగదారులు బిల్లులు చెల్లించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంస్థ వెబ్‌సైట్ , మొబైల్ యాప్ నుండి Bill desk – PGI, Paytm – PG, TA Wallet, TG/AP Online, MeeSeva, T-Wallet, Bill desk (NACH) ద్వారా బిల్లులు చెల్లింవచ్చు. వినియోగదారులకు మరింతగా సౌకర్యవంతమైన చర్యల్లో భాగంగా బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News