Wednesday, January 22, 2025

ఉద్యోగుల విరాళం రూ.230 కోట్లు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉద్యోగుల స్టీరింగ్ కమిటీ జెఎసి
రూ.130కోట్లు, ఉద్యోగుల జెఎసి రూ.100కోట్ల విరాళం
రూ. కోటి ప్రకటించిన సచివాలయ ఉద్యోగుల సంఘం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులు మానవత్వాన్ని చాటుకున్నారు. వరద బాధితులను ఆదుకోవడానికి తమ జీతం నుంచి ఒకరోజు మూలవేతనాన్ని సిఎం సహాయనిధికి విరాళంగా అందచేశారు. అందులో భాగంగా సచివాల య ఉద్యోగులు కోటి రూపాయాల విరాళాన్ని ప్రకటించగా, తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రూ.100 కోట్లను, తెలంగాణ ఉద్యోగుల జేఏసి స్టీరింగ్ కమిటీ రూ.130 కోట్లను సిఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించాయి.

ఈ నేపథ్యంలోనే దాదాపు రూ.130 కోట్లను సిఎం సహాయనిధికి అందజేస్తున్నట్టు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, టిఎన్జీఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్‌లు మంగళవారం ఉదయం తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల మూల వేతనంలో ఒక రోజు జీతాన్ని (రూ.130 కోట్లను) ఇస్తున్నట్టు తెలంగాణ ఉద్యోగుల జేఏసి స్టీరింగ్ కమిటీ నాయకులు మారం జగదీశ్వర్, శ్రీనివాసరావు, ముజీబ్‌హుస్సేనీ, రవీందర్‌రెడ్డిలు మహబూబాబాద్ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్‌ను కలిసి ఈ విషయాన్ని తెలియచేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి తీర్మాన కాపీని పంపించారు.

వరద బాధితులకు అండగా సచివాలయ ఉద్యోగులు
సచివాలయ ఉద్యోగులు సైతం గొప్ప మనసు చాటుకున్నారు. వరద బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఆ చెక్కును సచివాలయంలోని సిఎస్ శాంతి కుమారిని కలిసి అందజేశారు.

సిఎంను కలిసిన ఉద్యోగుల జేఏసి స్టీరింగ్ కమిటీ
ఇటీవల రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలు, తుపాను ప్రభావంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూశారని తెలంగాణ ఉద్యోగుల జేఏసి స్టీరింగ్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావులు పేర్కొన్నారు. సిఎం ను కలిసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ క్లిష్ట సమయంలో తమవంతుగా బాధితులను ఆదుకోవాలని నిర్ణయించామని వారు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్లు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఒకరోజు మూలవేతనపు మొత్తాన్ని సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సిఎంకు విజ్ఞప్తి చేశారు.

సిఎస్‌ను కలిసిన తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ
వరద బాధితులకు సహాయంగా ఉద్యోగుల ఒక రోజు వేతనం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు. సిఎస్‌ను కలిసిన అనంతరం లచ్చిరెడ్డి మాట్లాడు తూ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని, ప్రభుత్వం తగు సహాయక చర్యలు చేపడుతుందన్నారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారన్నారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ భావించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతగా నిలిచిందుకు జేఏసి ముందుకొచ్చిందన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగుల తరుపున ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ని ర్ణయం తీసుకోవడం జరిగింది.

ఒక నెల వేతనాన్ని ప్రకటించిన ఎమ్మెల్సీ మల్లన్న
మరోవైపు ఈ బాధితులకు తన వంతు సాయంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన ఒక నెల వేతనాన్ని ప్రకటించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వచ్చిన వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆ జిల్లాల ఎమ్మెల్సీగా తన నెల జీతం రూ.2.75లక్షల విరాళంగా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News