Sunday, April 13, 2025

ఎపిని అడ్డుకోండి

- Advertisement -
- Advertisement -

గోదావరి బనకచర్ల లింక్
ప్రాజెక్టు చేపట్టకుండా
నిలువరించాలి గోదావరి
రివర్‌బోర్డు, పోలవరం
ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ
ఇఎన్‌సి లేఖ ఎపి
పునర్విభజన చట్టానికి
ఇది పూర్తి విరుద్ధం
తెలంగాణ అభ్యంతరాలను
బేఖాతరు చేస్తున్న ఎపి
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదీ జలాలపై అక్రమంగా నిర్మించతలపెట్టిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టును వెంటనే అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈమేరకు శుక్రవారం గోదావరి నదీ యాజమాన్యం బోర్డు (జిఆర్‌ఎంబి), పోలవరం ప్రాజెక్టు అథారిటీలకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్‌సి) జి.అనిల్ కుమార్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఏకపక్షంగా ఏపి ప్రభుత్వం గో దావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిపాదించడం, ఇందుకు ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికిల్(ఎస్‌పివి)గా జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తూ

ఈనెల 3వ తేదీన జరిగిన ఏపి మంత్రివర్గ సమావేశం లో నిర్ణయం తీసుకోవడం, ఈనెల 8వ తేదీన ఉత్తర్వులు(జి.వో.నెం.16) జారీచేయడాన్ని తెలంగాణ తీవ్రంగా ఆక్షేపించింది. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కు విరుద్దమని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం వ్యక్తపరుస్తున్న అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఏపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆలేఖలో పేర్కొన్నారు. గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80,112 కోట్లు అంచనాలతో 200 టిఎంసి గోదావరి నీటిని మళ్లించుకోవాలని ఏపి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News