హైదరాబాద్: నవభారత నిర్మాణంలో తెలంగాణ ఇంజనీర్లు దేశానికే మార్గదర్శకులని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ స్టేట్ ఇంజనీర్స్ కార్యక్రమం ఆదివారం జలసౌధలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఇంజనీర్లు నవాబ్ అలీ నవాజ్ జంగ్ , మోక్షగుండం విశ్వేశ్వరయ్య , ఆర్.విద్యాసాగర్ రావు విగ్రహాలకు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరగిన కార్యక్రమంలో వినోద్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇంజనీర్ల పాత్ర మరువలేనిదన్నారు.
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ ఇంజనీర్లు గొప్పపాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ఇంజనీర్ల విశిష్టతను భావితరాలకు తెలిపేందుకు ప్రత్యేక గ్రంధాన్ని రచించాల్సిన అవసం ఉందన్నారు.అనంతరం పలువురు ఇంజనీర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నీటివనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి.ప్రకాష్ , ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ ,ప్రముఖ ఇంజనీర్లు శ్యాంప్రసాద్ రెడ్డి, దామోదర్ రెడ్డి, జనార్ధన్ , రమణ నాయక , వీరయ్య , శివాజి , ఈఎన్సీ మురళీధర్ , ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.
Telangana engineers are the pioneers of the country