Monday, November 18, 2024

బహుజన పాలనలోనే మంచి భవిత

- Advertisement -
- Advertisement -
Telangana Ex-IPS officer joins BSP
నల్లగొండ రాజ్యాధికార సంకల్ప సభలో ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్
ఎంపి గౌతమ్ సమక్షంలో బిఎస్‌పిలో చేరిన మాజీ ఐపిఎస్

మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: బహుజన రాజ్యం సాధించుకోవడంతోనే మన భవిష్యత్తు మ నమే నిర్ణయించుకోగలుగుతామని మాజీ ఐపిఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. బహుజనరాజ్యాధికారంలోనే సమస్తవర్గాల ప్రజలకు సముచిత స్థానం లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంకల్ప సభలో భాగస్వాములైన వారందరూ క్షేత్రస్థాయిలో బహుజనరాజ్యం గురించి విస్ర్తుతంగా చర్చించాలని కోరారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో జరిగిన రాజ్యాధికారం సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. సభ కు హాజరైన బహుజనుల సునామీని చూస్తుంటే బహుజన రాజ్యాధికారం సాధ్యమనే విశ్వాసం బలంగా కల్గుతోందని తెలిపారు. బహుజనులకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న తనను బిఎస్‌పి సాదరంగా ఆహ్వానించి రాష్ట్ర కోఆర్డినేటర్ పదవి ఇవ్వడంతో పాటు నవీన సమాజం కోసం బహుజనులన కార్యోణ్ముఖులను చేయాలన్న బాధ్యతను నా భుజస్కంధాలపై పెట్టిందని ఇది తన జీవితంతో మరుపురాని రోజంటూ వివరించారు.

తెలంగాణ సమాజంలో తరతరాలుగా బానిసలుగా జీవితాన్ని కొనాసాగిస్తూ వస్తున్న ఆయా వర్గాలు తనను ఆశీర్వదించి రాజ్యాధికారం సాధించేందుకు ఆశీర్వదించి పంపించాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది బహుజనులు ప్రాణత్యాగం చేస్తే సిద్దించిందని గుర్తు చేశారు. తెలంగాణ సిద్దించేందుకు కారణమైన అమరవీరులందరికి తన పాదాభివందనాలంటూ ప్రస్తావించారు. బహుజన రాజ్యం సాధించడం ద్వారానే ప్రతి ఒక్కరికి సమన్యాయం దక్కుతుందని అప్పటివరకు బానిస బతుకులు కొనసాగించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన రాజ్యాధికారం కోసం ఆరున్నరేళ్ళ అత్యున్నతమైన ఐపిఎస్ సర్వీసు తృణప్రాయంగా వదిలేశానని తెలిపారు. బహుజనుల కోసం ఎంతటి ఉన్నతస్థానాన్నైనా వదిలేసి ముందుకుసాగాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని వివరించారు. ఉన్నత వర్గాల కుట్రలకు బలికాకుండా ఐక్యంగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది.

బహుజన రాజ్యం కల తొందరలోనే నెరవేరబోతోందని జోస్యం చెప్పారు. ఉన్నతవర్గాలెవరు మా బతులకు నిర్ణయించడానికి బహుజనరాజ్యంలో మా మా బతుకులు స్వయంగా నిర్ణయించుకుంటామన్నారు. బహుజనుల బతుకులు మారాలంటే అత్యున్నతమైన ఉన్నత ప్రమాణాలు కల్గిన విద్య, వైద్యం అందాల్సిన అవసరం ఉందన్నారు. బహుజనరాజ్యం సాధించేందుకు ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాల్సి అవసరం ఉందని, బహుజనుల సునామిని ఏ ఒక్కరు ఎదుర్కొలేరన్నారు. రెక్కాడితే డొక్కాడని పేద ప్రజలు పిల్లలు విశ్వవిద్యాలయాల్లో అసౌకర్యాలతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన ఆరేడు దశాబ్దాలుగా ఉన్నతవర్గాల చేతిలోనే రాజ్యాధికారం కొనసాగుతుందని, బహుజనులకు ఆదిశగా అవకాశాలే రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బహుజనులు గమనించాలని కోరారు. అంతకు ముందు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తన రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానంటూ ఇటీవల ప్రకటించి నల్లగొండలో జరిగిన బహిరంగసభలో బిఎస్‌పి ఎంపి గౌతమ్ సమక్షంలో చేరారు. అంతకుముందు నల్లగొండ బైపాస్ మర్రిగూడ వద్ద అంబేద్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి భారీ ఎత్తున డప్పుకళాకారులు, కోలాటాలతో ర్యాలీతో ఎన్జీ కళాశాల మైదనానికి చేరుకున్నారు.ఈ సభలో బిఎస్‌పి రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News