- Advertisement -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వైరల్ గా మారిన బర్రెలక్క(శిరీష) కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. గురువారం రాష్ట్ర శాసన సభ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటల వరకు 63.94 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో సంచలనంగా మారిన బర్రెలక్కకు 15 వేల ఓట్లు రావచ్చని ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది. అయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జూపల్లి కృష్ణరావు గెలిచే అవకాశముందని పేర్కొంది. ఈ ఫలితాల్లో శీరిష గెలవకపోయిన గట్టి పోటీ ఇస్తోందని ఈ సర్వే వెల్లడించింది. కాగా తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ బిఆర్‌ఎస్‌కు 48 సీట్లు, కాంగ్రెస్‌కు 56 సీట్లు, బిజెపికి 10 సీట్లు, ఎంఐఎంకు ఐదు సీట్లు గెలిచే అవకాశం ఉందని న్యూస్-18 వెల్లడించింది.
- Advertisement -