Monday, December 23, 2024

బోర్ల కింద జోరుగా వరినాట్లు

- Advertisement -
- Advertisement -

ఆశలు రేకెత్తిస్తున్న బియ్యం ధరలు ఇప్పటికే 7.62లక్షల ఎకరాల్లో వేసిన
వరి నాట్లు సాగర్ ఆయకట్టులో బోర్ల కిందే సాగుతున్న వరి సాగు ఉత్తర
తెలంగాణలోనూ అదే పరిస్థితి 2.76లక్షల ఎకరాల్లో పప్పు ధాన్యాల పంటలు

మనతెలంగాణ/హైదరాబాద్ :ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం రైతులు పంటల సాగు పట్ల ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. యాసంగిలో రైతులు పెద్ద ఎత్తున వరిసాగుపై మొగ్గు చూ పుతున్నారు. కృష్ణా, గోదావరి నదుల పరీవాహకంగా ఉన్న రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో ఆ యకట్టుకు సరిపడినంత నీటినిలువలు లేకపోయినప్పటికీ రైతులు బోరు బావుల కింద పెద్ద ఎత్తున వరినాట్లు వేస్తున్నారు. భూగర్భజలాల లభ్యతను ఆధారంగా చేసుకుని ఇప్పటికే రాష్ట్రంలో వరిసాగు సాధారణ విస్తీర్ణంలో 18.84శాతం వరినాట్లుపడ్డా యి. మార్కెట్‌లో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధ రలే రైతుల్లో వరిసాగు పట్ల ఆశలు రేకెత్తిస్తున్నా యి. పాత బియ్యం ఇప్పటికే క్వింటాలు నాణ్యత ను బట్టి రూ. 7వేలనుంచి 8వేలకు చేరువయ్యా యి.సన్నరకాల బియ్యం ధరలు సామన్యులకు చుక్కలు చూపుతున్నాయి.

ఫైన్‌క్వాలిటి రకం రిటైల్‌గా కిలో 80 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇ దే రీతీలో ధరలు పెరుగుతూ పోతే రికార్డు స్థాయి లో బియ్యం ధర సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోవాల్సి న అవసరం లేదని బియ్యం వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో యాసంగి పంటల సీజన్ కింద అన్ని రకాల పంటలు కలిపి 54.93లక్షల ఎకరా ల విస్తీర్ణంలో పంటలు సాగు చేయించాలని వ్యవసాయశాఖ లక్షంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగా పంటల వారీగా వ్యవసాయ ప్రణాళికను రూపొందించింది. అయితే అందులో సింహభాగం వరిపంట సాగుకే ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్రంలో ఈ సీజన్ కింద 40.50 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణంలో వరిసాగును అంచనా వేసింది.మొక్కజొన్నలు, జొన్నలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు తదితర ఇతర రకాల పంటలన్నీ కలిపి ఈ యాసంగిలో కేవలం 14.43లక్షల ఎకరాల్లో సాగులోకి వస్తాయని అంచనా వేసింది. వరిసాగుకు అవసరమైనంత మేరకు సాగునీరు అందుబాటులో లేకపోయినప్పటికీ, రైతులు సాహసించి వరిసాగు దిశగా దూసుకుపోతున్నారు.

గత నెల మూడవ వారం నుంచి రాష్ట్రంలో వరినాట్ల ప్రక్రియ మొదలైంది. సాధారణ విస్తీర్ణంలో ఈ సమయానికి 5.43లక్షల ఎకరాల్లో వరినాట్లు పడాల్సివుంది. అయితే ఇప్పటికే సీజన్ నార్మల్‌కు మించి 2లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. సీజ న్ ప్రారంభం నుంచి బుధవారం నాటికి రాష్ట్రంలో మొత్తం 7.62లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయినట్టు వ్యవసాయశాఖ వెల్లడించింది. మొత్తం సీజన్ నార్మల్‌లో ఇప్పటికే 18.84శాతం వరిసాగు జరిగినట్టు తెలిపాయి. కృష్ణానది పరీవాహకంగా ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో ఈ సారి నీటినిలువలు అడుగంటాయి. జూరాల ప్రాజెక్టులో కేవలం 6.97టిఎంసీలు మాత్రమే నిలువ ఉన్నాయి. శ్రీశైలం జాలశయంలో నీటిమట్టం రోజురోజుకు అడుగంటుతోంది. ఈ ప్రాజెక్టులో నీటినిలువ 49టిఎంసీలకు పడిపోయింది. దిగువన నాగార్జున సాగర్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. సాగర్‌లో 154టిఎంసీలు నిలువ ఉన్నాయి. శ్రీశైలం , సాగర్ రిజర్వాయర్లలో డెడ్‌స్టోరేజిలు పోగా మిగిలిన నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందని అధికారులు తేల్చేశారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటివిడుల లేకపోవటంలో రైతులు పెద్ద ఎత్తున భూగర్భ జలాలపై ఆధారపడి బోర్ల కింద వరినాట్లు వేస్తున్నారు. గోదావరి నదీ పరీవాహకంగా ప్రాజెక్టులో నీటినిలువలు కొంత ఆశాజనకంగా ఉన్నాయి.

అయి తే ఇక్కడ శ్రీరాంసాగర్,నిజాంసాగర్, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, సింగూరు తదితర ప్రాజెక్టుల కింద ఆయకట్టును కుదించి ఆన్‌ఆండ్ ఆఫ్ పద్దితిలో నీటివిడుదలను నియంత్రిస్తున్నారు. ఉత్తర తెలగాణలో అధికశాతం రైతులు బోర్ల కిందనే వరినాట్లు వేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 2.02లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డా యి. జోగులాంబ గద్వాల జిల్లాలో 1.23 లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 1.11లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా లో 55వేలు, కరీనగర్ జిల్లాలో 36 వేలు, వరంగల్ జిల్లాలో 20వేలు, సిద్దిపేట జిల్లాలో 20వేలు, జగిత్యాల జిల్లాలో 11వేలు,పెద్దపల్లి జిల్లాలో 16వేలు, మేడ్చెల్‌లో 15వేల ఎకరాల్లో ఇప్పటికే వరినాట్లు పడ్డాయి.

2.76లక్షల ఎకరాల్లో పప్పుధాన్య పంటలు

రాష్ట్రంలో యాసంగి సీజన్‌కింద ఇప్పటివరకూ 2.76లక్షల ఎకరాల విస్తీర్ణంలో పప్పుధాన్య పంటలు సాగులోకి వచ్చాయి. ఈ సీజన్‌లో కంది, పప్పుశనగ, పెసరు, మినుము, ఉలవ తదితర పప్పుధాన్య పంటల సాగు మొత్తం 4.21లక్షల ఎకరాల్లో సాగు చేయించాలన్నది లక్షం కాగా ఇప్పటివరకూ 3.22లక్షల ఎకరాల్లో ఈ పంటలు సాగులోకి రావాల్సివుంది. అయితే సాధారణ విస్తీర్ణంలో 65.56శాతం సాగులోకి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. నూనెగింజ పంటల విస్తీర్ణం 3.71లక్షల ఎకరాల్లో అంచనా వేయగా ఇప్పటివరకూ 2.04లక్షల ఎకరాల్లో ఈ పంటలు సాగు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News