Wednesday, January 22, 2025

మళ్లీ మనమే ఫస్ట్

- Advertisement -
- Advertisement -

పంచాయతీ ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో

మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మెరిసింది. మరోసారి తన సత్తాను చాటుకుంది. కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పంచాయితీరాజ్ శాఖ విభాగంలో వంద శాతం ఆన్‌లైన్ ఆడిటింగ్ చేసిన రాష్ట్రాల్లో వరసగా రెండవసారి కూడా మన రాష్ట్రం తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. ఆడిటింగ్‌లో మళ్లీ మొదటి స్థానంలో నిలిచి దేశానికి ఆ దర్శంగా నిలిచింది. తెలంగాణ సాధించిన ప్రగతిపై కేంద్రం సైతం ప్రశంసల జల్లు కురిపిస్తోం ది. దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణను రోల్‌మోడల్‌గా చేసుకుని పంచాయితీరాజ్ శాఖలో వందశాతం ఆడిటింగ్ వ్యవహరాలు ఆన్‌లైన్ ద్వారా జరపాలని సూచిస్తోంది. 12,769 గ్రామ పంచాయతీలు, 540 మండలాలు, 32 జిల్లా పరిషత్‌లు ఉన్న తెలంగాణ రెండోసారి కూడా నేషనల్ లీడ్ స్టేట్ గా నిలిచింది.

దీనిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందిస్తూ…. ఇది గర్వించతగ్గ విషయం అన్నారు. దేశంలో 100 శాతం ఆడిట్ సాధించిన మొదటి రాష్ట్రంగా ఉండటం వెనుక మన రాష్ట్ర అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కృషి ఉందన్నారు. ఆడిటింగ్‌లో మొదటి స్థానం రావడానికి ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ల ప్రోత్సాహంతో అధికారులు బాగా పనిచేశారన్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ శాఖకు వచ్చిన ప్రసంశలపై కెటిఆర్ ట్విట్టర్ వేదిక ద్వారా అభినందించినందుకు ప్రత్యేకంగా ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు, అవార్డులు ఇచ్చినట్లే నిధులు కూడా ఇవ్వాలని కోరారు. ఈ ర్యాంకు రావడానికి కృషి చేసిన గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పనిచేసిన అధికారులు, ఉద్యోగులకు, సిబ్బందికి కూడా మంత్రి అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News