సాహిత్యం అంటే హితాన్ని కూర్చేది, మేలు చేకూర్చేది. ‘హితేన సహితం సాహిత్యం’ అనడం కద్దు. అయితే సాహిత్యంలో మౌఖిక, లిఖిత సాహిత్యం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. మళ్ళీ లిఖిత సాహిత్యాన్ని 19వ శతాబ్దికి పూర్వం పద్య రూపం లోనే గ్రంథాలలో, ప్రబంథాలలో మనకు కనిపిస్తుంది. కాని పాశ్చాత్య ప్రబావంతో ఆదునిక కవిత్వం బహురూపాలుగ విలసిల్లుతుంది. అది కవిత, కథ, నవల,నాటకం, వ్యాసం,జీవిత చరిత్రలు. మొ॥లగు రూపాలలో నేడు మనకు దర్శనమిస్తుంది. అయితే సాహిత్య ప్రక్రియ ఏదైనా అది సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి. అప్పుడే ఆ సాహిత్యానికి సార్దకత ఏర్పడుతుంది. గతకాలపు సాహిత్య రచనను బేరీజు వేస్తే ఆనాటి సమాజ స్థితిగతులు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు తెలుస్తాయి, వీటిని అంచనా వేయడానికి తోడ్పడుతుంది. అందుకే నాటి సాహిత్య విమర్శకులు సాహిత్యాన్ని యుగవిబజన చేశారు. తెలంగాణ సాహిత్యానికి వేటూరి ప్రబాకర శాస్త్రి, ఖండవల్లి లక్ష్మిరంజనం, బిరుదురాజు రామరాజు, సురవరం ప్రతాపరెడ్డి,శేశాద్రి రమణ కవులు, మొ॥లగు వారిని స్మరించుకోవాలి.
ఆదునిక కవిత్వం 1875లో మొదలైంది.పూర్వకాలంలో వెలువడిన సాహిత్యం సాంప్రదాయక సాహిత్యం. నేడు అనగా ఆదునిక కాలంలో 19వ శతాబ్ది నుండి మొదలయినదే ఆదునిక కవిత్వం.మన దేశంలో ఈ కాలంలో బ్రిటిషువారి ఏలుబడిలు పాశ్చాత్య సంస్కృతితో మిలీతమై హిందూ సంస్కృతి కొత్త పోకడలు తొక్కింది. సి.నా.రె. తన ఆదునికాంద్ర కవిత్వము సంప్రదాయములు ప్రయోగములు అనే సిద్దాంత గ్రంధంలో ఆదునిక కవిత్వాన్ని కండకావ్య,ఆత్మాశ్రయరీతి వస్తునబ్యత భావనవ్యత,శైలి నవ్యత,కవిత రచనల్లో నబ్యత.మొదలగు వాటిని పేర్కొన్నారు.17981832 మద్య పాశ్చాత్య ప్రభావంతో కాల్పనిక వాదం ప్రవేశించింది.దీనినే తెలుగులో భావకవిత్వం,ప్రణయ కవిత్వం,ప్రణయభావ కవిత్వంగా విలసిల్లింది.ఇంగ్లీషులో 19వ శతాబ్దం ప్రారంబంలో వచ్చిన ‘రొమాంటిక్ పోయెట్రి’ అబ్యుదయం అనే పదాన్ని ప్రగతి పురోగమనం అనవచ్చు.193334 తెలుగులో అబ్యుదయ కవిత్వం మొదలయ్యింది.నా దృష్టిలో జీవితాన్ని విమర్శించేది సాహిత్యం.
ఏ రూపమైనా కావచ్చు జీవితాన్ని తప్పనిసరిగా వాఖ్యానించాలి.భాష్యం చెప్పాలి.రచయితలు,దళితులు,పీడితుల పక్షం వహిస్తారు అని ప్రకటించాడు ప్రేవ్‌ుచంద్.దాశరది,‘అగ్నిదార’, సోమచందర్ ‘వజ్రాయుదం’,అని సెట్టి ‘అగ్నివీణ’ కుందుర్తి ‘తెలంగాణ’.28 మంది కవుల కవితా సంపుటి ప్రత్యూష కవితా సంపుటిలో నేగాక.తెలంగాణ ఉద్యమ కవితగా,గేయంగా ఆ బాలగోపాలాన్ని ఉరూతలూగించి నది ఈ గేయకవిత నేడు కూడా ప్రజల నాల్కెలపై నడయాడుతూనే ఉంది.దాశరది గారి గేయం‘ఆ చల్లని సముద్ర గర్బం’పాట ప్రశ్నార్దకం శీర్షికన ప్రత్యూష కవితా సంపుటిలో నిది గడియారం రామకృష్ణశర్మ హైదరాబా దు రాజ్య ఔన్నత్యాన్ని తన సీసపద్యాలతో కీర్తించారు.కప్పగంతుల లక్ష్మణశాస్త్రి తన పద్యాలలో తెలంగాణ కవుల గణతను కొనియాడారు.అలాగే దవల శ్రీనివాసరావు ‘మదురోహ కవిత స్వేచ్చాగీతిక’దేవులపల్లి రామనుజరావు గారి‘పూలచెట్లు’పద్యకవిత ఆదునిక కవితా రీతికి అద్దం పడుతుంది.కాళోజి కవిత హృదయ వేదన నేటికి సజీవ చిత్రికమైన కవిత‘ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు’…తన బావావేశ అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది.ముటుపురిగారు ‘చందమామ’కవితలో జానపదాలు ఆకట్టుకునే రీతిన బావకవిత రాశాడు.
ప్రత్యూష కవితా సంపుటిలో 28మంది కవులు తమదైన శైలిలో పద్య,వచన కవితా, గేయకవితలను ఆలపించారు.అడ్లూరి అయోద్య రామయ్య(1922),దీపావళి,కప్పగంతుల లక్ష్మణశాస్త్రి(1917),కాళోజి నారాయణరావు,కాళోజి కథలు,నా భారతదేశయాత్ర,కండకావ్యాలు, కేశపంతుల నృసింహశాస్త్రి(1919),త్యాగదనుడు,ఖండవల్లి లక్ష్మిరంజనము (1908),తెనుగుదుక్కి,ఆంద్రసాహిత్య చరిత్ర,గడియారం రామకృష్ణ శర్మ(1919),చంద్రహాస పద్యకావ్యం,అలంపూరు శిథిలము,చాటుపద్యాలు,తైలంగ సంస్కృతి,గార్లపాటి రాఘవరెడ్డి(1904),జమ్మలమడక సూర్యప్రకాశరావు(1919),దాశరధి కృష్ణమాచార్యులు(1927),సమసమాజం అనే కల నిజం కావడమే ఈయన జీవిత ఆదర్శం.కవిత్వానికి ఆశయము అయ్యింది.‘పేదల ఎంగిలి మెతుకులు దొంగిలించి బంగారం పొంగించే దనికులను మింగాలని దొంగచాటుగా కాలం తొంగిచూస్తున్న’దను హెచ్చరికను చేస్తారు.దాశరధి అభ్యుదయ కవుల్లోను,ఇతర విప్లవ రచయితల్లోను తలబంతి అనిపించుకున్నాడు.అగ్నిదార,రుద్రవీణ ఇతని రచనలు.
దేవులపల్లి రామానుజారావు(1916)ఏకవీర,ధవళా శ్రీనివాసరావు(1919),ఖండకావ్యాలు పర్సా జానకీదేవి(1923)మహిళా అభ్యున్నతికోసం పాటుపడి రచనలు చేసింది.పల్ల దుర్గయ్య(1916)కవిత్వాన్ని కళగా ఉపాసించుతూ మాతృభాషను కొల్చుటే ఈయన జీవిత ఆదర్శం. పిల్లలమర్రి వెంకట హనుమంతురావు(1918),పులిజాల హనుమంతరావు(1919),పొట్లపల్లి రామారావు(1920). బూర్గుల రంగనాదరావు(1917),బెల్లంకొండ చంద్రమౌలిశాస్త్రి (1918),బహుగ్రందకర్త,బాగి నారాయణమూర్తి (1912), మూటుపురి వెంకటేశ్వరావు (1919),వివిద గేయాలు,వానమామలై వరదాచార్యులు(1912),మణిమాల,పుర్పుటేరు రాఘవాచార్యులు(1922),వెల్దుర్తి మాణిక్యరావు(1918) సన్నిదానం శ్రీదరశర్మ(1920),సిరిప్రగడ బార్గవరావు(1923)సాహితీమేఖల హేమవాలయంలో భాసించే చంద్రజ్యోతి ఈయన.మా అమ్మమ్మ ఊరు గుండ్రపల్లి చండూరు మండలం నల్లగొండ జిల్లా వారు.అంబటిపూడి వెంకటరత్నం ప్రియశిష్యుడు.
సిరిప్రగడ రాదాకృష్ణారావు(1916) సురవరం ప్రతాపరెడ్డి(1996)గోలకొండ పత్రిక స్థాపకుడు,సోమరాజు ఇందుమతీదేవి(1915) వీరు ప్రత్యూష సంపుటి కవులు వీరిని ఒక్కొకరిగా వివరించాలంటే ఒక్కో గ్రంధమే తయారవుతుంది.ఈ కవులు మరుగున పడిపోకుండా తెలంగాణ ప్రచురిణకర్తలు ప్రత్యూష కవితా సంపుటిని పునర్ముద్రించి మనముందుంచిన వారి కృషికి అభినందనలు.