Saturday, November 16, 2024

ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ముందంజ: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Telangana first position in innovation field

హైదరాబాద్: 2020 నుంచి సాప్రాన్ కంపెనీతో చర్చలు జరుపుతున్నామని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ వివరించారు. శంషాబాద్ లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్, ఎలక్ట్రికల్- పవర్ ఫెసిలిటీ సెంటర్ ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. పెట్టుబడులకు హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. ఎయిరో స్పేస్ రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని ప్రశంసించారు. జాతీయ స్థాయిలో హైదరాబాద్ అగ్ర స్థానంలో ఉందని కితాభిచ్చారు.

హైదరాబాద్ లో సాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్ఓ ప్రపంచంలోనే పెద్దదని కొనియాడారు. ప్రపంచ స్థాయి సంస్థ భారత్ లో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్ ఎంఆర్ఒ మనదేనని చెప్పారు. ఎంఆర్ఒ, ఇంజిన్ టెస్ట్ సెల్ పెట్టుబడి దాదాపుగా రూ.1200 కోట్లు అని మెచ్చుకున్నారు. 800 మంది నుంచి 1000 మందికి ఉపాధి లభిస్తుందని, సాఫ్రాన్ నిర్ణయంతో హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర సంస్థలు ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. పెట్టుబడుదారులే తెలంగాణకు అతిపెద్ద అంబాసిడర్లని సిఎం కెసిఆర్ అంటుంటారని గుర్తు చేశారు. తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ ఉందని కెటిఆర్ స్పష్టం చేశారు. ఆవిష్కరణల ఆలోచనల కోసం టిహబ్ వంటి ప్లాట్ ఫామ్ తెచ్చామన్నారు. విమానరంగంలో తెలంగాణకు కేంద్రం నుంచి అనేక అవార్డులు వచ్చాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News