హైదరాబాద్: కులవృత్తులకు చేయూతనందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. కోకాపేటలో ముదిరాజ్ ఆత్మగౌరవ భవనానికి మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. కాళేశ్వంలాంటి ప్రాజెక్టులు కట్టి 365 రోజులు చెరువుల్లో నీళుల ఉండేలా చూస్తున్నామన్నారు. మత్సకారులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. మన చేపలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. చెరువులపై మత్సకారులకు మాత్రమే హక్కు ఉందన్నారు. ఏడాదికి 60 కోట్ల చేప పిల్లలను మత్సకారులకు అందిస్తున్నామని, తెలంగాణలో చేపల ద్వారా 600 నుంచి 700 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని తెలియజేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో చేపలు మార్కెట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చేపట మార్కెట్లలో మత్సకారులు మాత్రమే అమ్ముకునే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పలుమార్లు చెప్పామన్నారు. మటన్, చికెన్ కంటే చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతారని తలసాని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపిలు కెకె, బండ ప్రకాశ్ ముదిరాజ్, రంజిత్ రెడ్డి, తదితరలు పాల్గొన్నారు.
మన చేపలకు మార్కెట్‌లో మంచి డిమాండ్: తలసాని
- Advertisement -
- Advertisement -
- Advertisement -