Friday, November 15, 2024

సిద్దిపేటలో కొత్తది నేర్చుకొని వెళ్తాను: తలసాని

- Advertisement -
- Advertisement -

సిద్దపేట: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సిద్దిపేటలో పుట్టాడని, మంచి లీడర్ హరీశ్ రావు ఇక్కడ సిద్ధిపేటలోనే ఉండడం అదృష్టంగా భావించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సిద్ధిపేట జిల్లాలో ఏడవ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుతో కలసి చింతల్ చెరువులో 52 వేల చేప పిల్లలను వదలడం జరిగింది. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. సిద్ధిపేటను చూసి అందరూ నేర్చుకుని వెళ్తారని, తాను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుని వెళ్తానని చెప్పారు. హరీష్ అన్నకు ఏ శాఖ ఇచ్చిన దానికి పూర్తి న్యాయం చేస్తారని ప్రశంసించారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలని చేపలు ఉచితంగా ఇస్తున్నారని, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన చేపలు తినమని చెప్తారని, ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా చేపలు దొరుకుతున్నాయని హరీశ్ రావు మెచ్చుకున్నారు. భారత దేశంలో ఎక్కడ లేని విధంగా చేపలు, రొయ్యలు, గొర్రెల పంపిణీ ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ఒక్కటేనని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News