Wednesday, January 22, 2025

ఏషియన్ గేమ్స్‌లో ఎగిరిన తెలంగాణ జెండా

- Advertisement -
- Advertisement -

రాష్ట్రానికి పతకాల పంట 

ఇషా,నిఖత్ , నందినిల అద్భుత విజయాలు
హర్షం వ్యక్తం చేసిన ‘శాట్స్’  ఛైర్మన్ ఆంజనేయ గౌడ్

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో  వివిధ క్రీడా విభాగాల్లో తెలంగాణ ఆణిముత్యాలు సత్తా చాటి, రాష్ట్రం గర్వపడే విజయాలు సాధించారని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ ప్రోత్సాహంతో చైనా వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో తెలంగాణ ప్రతిభకు పతకాల పంట పండిందన్నారు. ఈ ముగ్గురి విజయం తెలంగాణ రాష్ట్ర యువతలో కొత్త ప్రేరణ కలిగించిందన్నారు. ఇషా,నిఖత్, నందినిలకు మొదటి నుంచి అన్ని విధాలా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అండగా నిలవడం వల్లే ఏషియన్ దేశాలను వెనక్కి నెట్టేసి తెలంగాణ బంగారాలు విజేతలుగా నిలిచారని ఆనందం వ్యక్తం చేశారు.

ప్రతిభ కలిగిన క్రీడా కారులకు సిఎం కెసిఆర్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ఒకవైపు గ్రామంలో క్రీడా మైదానాలు నిర్మించి, గ్రామీణ క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ, మరొకవైపు ప్రఖ్యాత క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి, హైదరాబాద్‌ను క్రీడల హబ్‌గా తీర్చిదిద్దిందని నిరంతర క్రీడా కార్యక్రమాల నిర్వహణ, క్రీడాకారుల ప్రోత్సాహం ఉండే విధంగా కెసిఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News