Monday, December 23, 2024

పాటే ప్రాణం..ఉద్యమమే ఊపిరి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ నినాదమైన… పాలమూరు
గొంతుక తండ్రి నుంచి కళను
అందిపుచ్చుకున్న సాయిచంద్ పేదరికం
నుంచి పోరుదాకా మొదట్లో
పిడియస్‌యు నేతగా తెలంగాణ మలిదశ
ఉద్యమంలో పాటలతో ఉర్రూతలు
ఊగించిన సాయి కెసిఆర్ సభ ఉంటే
సాయిచంద్ ఉండాల్సిందే

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ప్రజల ఆశలు ఆవేదనలే..పల్లె పాటలు…వారి మన సు ఆకళింపు చేసుకోవడానికి అవి ఎంతో అవసరం … లెనిన్ రాయినైనా పాటతో కరిగించే గొంతు ఆయనది.. ఆయన గజ్జెకట్టి ఆడి పాడితే సభా ప్రాంగణం దద్దరిల్లాల్సిందే… ఆ యన గొంతు నుంచి సెలమిలాగా గోదావరి అలలులాగా పా టలు ప్రవహిస్తూనే ఉంటాయి…లక్షల మందినిసైతం తన పాటలతో నిలబెట్టగల చైతన్యం ఆయనది. ప్రత్యేక తెలంగా ణా రాష్ట్ర సాధనలో ధూంధాం పేరుతో ఆయన ఆడిన ఆటపా ట ప్రజల ఆకాంక్షల చైతన్యం ఆయన.. పిడియస్‌యు ఉద్యమనేతగా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించి తెలంగాణ రా ష్ట్ర సాధనలో పాటల సునామిగా మారి.. బిఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా ఎదిగిన నేత ఆయన. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తల లో నాలుక ఆయన. ఆయన కంఠం లక్షలమంది ప్రజల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది ఆయనే సాయిచంద్.. తెలంగాణ గాయకుడు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్…ఆయననాగర్ కర్నూలు జిల్లా కారుకొండలో తమ ఫాంహౌస్‌లో గురువారం గుండెపోటుతో హఠాన్మరణం చెం దారు.

ఆయన ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వేలాది మంది గుండెల్లో ప్రేమను సంపాదించిన సాయిచంద్ ఇక లేడని, ఆయన గొంతు ఇక వినపడదని వేలాది మంది ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. సాయిచంద్‌ది వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రం. ఆయన సెప్టెంబర్ 20,1984 లో జన్మించారు. తండ్రి వెంకట్రాములు తల్లి మనెమ్మ. వారికి ఇద్దరు మగ పిల్లలు. వీరిలో సాయిచంద్ రెండవ కుమారు డు. పెద్ద కుమారుడు మిలటరీలో పని చేస్తూ గత కొంతకాలం క్రితం ఆనారోగ్యంతో చనిపోయారు. తల్లి మనెమ్మ కూడా గత కొంత కాలం క్రితం కరెంట్ షాక్‌తో మృతి చెందా రు. తండ్రి వెంకట్రాములు ఆర్‌టిసి కండెక్టర్‌గా పని చేస్తూ విప్లవ భావాలవైపు ఆకర్షితులయ్యారు.

కండెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తికాలంగా సిపిఐ ఎంఎల్ ప్రజా పంథ పార్టీలో పని చేస్తూ వచ్చారు. ఒక వైపు పార్టీలో పని చేస్తూనే మరో వైపు కుటుంబాన్ని నడుపుకుంటూ వచ్చారు. వెంకట్రాములకు పాటలన్నా, ప్రజా కళలు అన్నా ప్రాణం. ఈ నేపథ్యంలో ఆయన పూర్తి కాలంగా ఆరుదోదయ కళామండలిలో పని చేశారు. అమరచింతలో పార్టీ బలంగా ఉన్న సందర్భంలో పార్టీ ఆధ్వర్యంలోనే ఒక పాఠశాలను నడిపిం ది. ఈ పాఠశాలలోనే సాయిచంద్ 1 నుంచి 5 వరకు చదుకున్నారు. 6 నుంచి పదవతరగతి వరకు అమరచింతలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేశారు.

ఇంటర్‌మీడియట్ ఆత్మకూర్ ప్రభుత్వ కళాశాలలో చదివారు. డిగ్రీ హైదరాబాద్‌లోని విద్యానగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో చదివారు.ఎంఎ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా రు. ఇంటర్ వరకు సాయిచంద్ పిడియస్‌యు నేతగా ఉంటూ వ చ్చారు. తండ్రి ఆరుణోదయ కళాకారుడు కావడంతో తండ్రి వారసత్వాన్ని పునికిపుచుకున్న సాయిచంద్ కూడా పాటలు పాడేవారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పిడియస్‌యు లో ఉంటూనే తెలంగాణా రాష్ట్ర సాధనలో కీలకంగా పని చే శారు. పాటల ద్వారా తెలంగాణా కళాకారులు ధూంధాం ఏ ర్పాటు చేయడంతో అందులో చేరారు.

చిన్న ప్రాయంలోనే ధూంధాంలో ఆయన ఆడిన పాడిన పాటలు తెలంగాణా మొ త్తం సమాజాన్ని ఉర్రూతలూగించాయి. ఈ నేపథ్యంలోనే సాయిచంద్ కెసిఆర్‌కు దగ్గరయ్యారు. సాయిచంద్ పాటలు కెసిఆర్‌కు కూడా ప్రాణంగా మారడంతో సాయిచంద్ లేని సభ లేదంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ వెంట ఉంటూ వచ్చారు. బిఆర్‌ఎస్ పార్టీలో కీలకంగా ఉంటూ వచ్చారు. కెసిఆర్ సభ ఎక్కడ ఉన్నా లక్షలమంది ప్రజలను గంటల పాటు ఎక్కడా కదలనీయకుండా తన ఆటలు, పాటలతో ఆలరించేవారు. దీంతో వేలాది మంది ప్రజలకు ఎమ్మెల్యేలకు సాయిచంద్ దగ్గరయ్యాడు.

2012లో ప్రేమ వివాహం

సాయిచంద్‌ది ప్రేమ వివాహం. ఉస్మానియా యూనివర్సిటీ లోచదుకునే క్రమంలో విద్యార్ది ఉద్యమ నేతగా ఉంటూ ఆట, పాటలతో ఉన్న ఆయన అదే యూనివర్సిటీలో ఉన్న రజనినీ 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో ఇరువురి కులాలు వేరు కావడంతో రజని తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినప్పటికి తర్వాత ఇరువురి పెద్దల సహకారంతో ప్రేమ వి వాహం చేసకున్నారు. రజినిదీ కూడా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం వేముగోముల గ్రామం. వీరికి కుమారుడు చెర్రి..కూతురు నది ఉన్నారు.

ఎంతో అన్యోన్యంగా ఉం టున్న సాయిచంద్ ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఉంటూ రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో ఆయ నమరణం తెలంగాణా సమాజానికి తీరనిలోటుగా మారింది. సాయిచంద్ మరణ వార్త యావత్ పాలమూరు జిల్లాను కన్నీరు మున్నీరు చేసింది. ఆయన మరణ వార్త విన్న వెంటనే మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, రాజేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చిట్టెం రాంమోహన్ రెడ్డి, జైపాల్ యాదవ్ , భీరం హర్సవర్దన్ రెడ్డి, అబ్రహం, వంటి నేతలు వెళ్లి సాయిచంద్ భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News