Monday, December 23, 2024

ఐటిలో తెలంగాణ ముందంజ: పీయూష్ గోయల్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: తెలంగాణ యువత దేశ వ్యాప్తంగా ఐటి రంగంలో దూసుకుపోతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. యూసుఫ్‌గూడలోని సవేరా ఫంక్షన్ హాల్‌లో జరిగిన బిజెపి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్‌భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి శ్రేణులు ఇంటింటికి వెళ్లి… రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాతో యువతకు అనేక అవకాశాలు కల్పిస్తోందన్నారు. ఆదివాసీ దేవతలు సమ్మక్క-సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని తెలంగాణకు ప్రకటించిందన్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే తెలంగాణలో పెట్టుబడులు 11 రెట్లు పెరిగాయి. దశాబ్దాలుగా పీడిస్తున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.

దేశంలో పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజనతో ఆదుకుంటోంది. రైతులకు మేలు చేసే ఈ పథకాన్ని బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. పేదలు, రైతులు, వారి కుటుంబం బాగుపడాలంటే ఒక్క బిజెపి తోనే సాధ్యం అన్నారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటడానికి జూబ్లీహిల్స్ నాంది పలకాలని పిలుపునిచ్చారు. 4 కోట్ల మంది ప్రజల కోసం తెలంగాణ తెచ్చుకుంటే నలుగురి కోసమే అన్నట్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో మజ్లిస్ పెత్తనం కొనసాగుతోంది. బిఆర్‌ఎస్ పార్టీ గుర్తు కారు.. కాని ఆ కారు స్టీరింగ్ ఓవైసీ చేతుల్లో ఉందన్నారు. జూబ్లీహిల్స్ లో కాషాయ జెండా ఎగురవేసి అభివృద్ధి చేసుకుందామని అన్నారు. సమావేశంలో రాష్ట్ర బిజెపి నేతలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News