హైదరాబాద్ : గత ఎనిమిదేళ్లుగా తెలంగాణకు హరితహారం ద్వారా అటవీశాఖ అమలు చేస్తున్న వినూత్న పథకాలు, వాటి ప్రదర్శనకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్)లో మొదటి బహుమతి లభించింది. ఎగ్జిబిషన్- 2023 ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై హోం మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా అటవీశాఖ అధికారులు ఈ బహుమతిని అందుకున్నారు.
ప్రభుత్వశాఖలు, పథకాల అమలు ప్రదర్శన, మంచి అలంకరణ విభాగంలో తెలంగాణ అటవీశాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌కు ఈ బహుమతి దక్కింది. ప్రతిఏటా జరిగే ఎగ్జిబిషన్‌లో తెలంగాణ అటవీశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రదర్శన, మినీ జూతో కూడిన స్టాల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ సారీ అడవి, వన్యప్రాణుల థీమ్‌తో అకర్షణీయంగా తీర్చిదిద్దిన ఈ ప్రదర్శన సందర్శకులు అందరినీ బాగా ఆకట్టుకుంది. ఈయోడు కూడా సమర్ధవంతంగా స్టాల్‌ను నిర్వహించి బహుమతి గెలుచుకున్న అధికారులు, సిబ్బందిని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ ఎం. డోబ్రియాల్, ముఖ్యమంత్రి ఓఎస్‌డి (హరితహారం) ప్రియాంక వర్గీస్ ఈ సందర్భంగా అభినందించారు.